తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితిలు నెలకున్నాయి... ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితిల కోసం అదునుగా చూసుకుని తగలబెట్టే వైసిపి పార్టీ మరోసారి, తగలబెట్టింది... ఈసారి పోలీసు స్టేషన్ తగలబెట్టే ప్రయత్నం చేశారు... వైసిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు , మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు తనయుడు జక్కంపూడి రాజా విధుల్లో ఉన్న పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించటంతో, అక్కడ ఉన్న ఎస్ఐ, జక్కంపూడి రాజాని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు...
సంఘటన పూర్వాపరాలు ఇలావున్నాయి... జక్కంపూడి రాజా అత్తవారి ఇల్లు ద్రాక్షారామ లో ఉంది . ఈ క్రమంలోఅక్కడు వెళ్ళిన రాజా తన సతీమణి తో కలసి రాజమహేంద్రవరం కారు లో బయలుదేరారు . రామచంద్రపురం మసీద్ సెంటర్ ఖజానా జ్యులరీస్ వద్దకు వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయింది . అక్కడ రోడ్ పనులు జరుగుతుండటం తో ఒకవైపే వాహనాలు వెళుతున్నాయి . ఈ సమయంలో రాజా కారు అక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కంది... వెనక్కు వెళ్లాలని , పక్కకు తీయాలని , ఇలా ఒకటికి రెండుసార్లు అక్కడ వున్నా ఎస్ ఐ నాగరాజు అనడంతో, అలా చేసినా తన కార్ ముందకు వెళ్ళలేదు.... రాజా, ఎస్ ఐ ని వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది... రాజా కారు కిందకు దిగి తాను జక్కంపూడి రాజా నని చెప్పడం తో ఐతే ఏమిటంటూ ఎసై అనటంతో, రాజా మరింత రెచ్చిపోయి ఎస్ఐని దుర్భాషలాడటంతో వాగ్వివాదం చోటుచేసుకుంది . దీంతో ఇద్దరు కలబడ్డారు.. చివరకి ఎస్ఐ, జక్కంపూడి రాజాని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు...
అయితే, ఈ సందర్భాన్ని వైసిపి రాజకీయంగా వాడుకుంటానికి ప్రయత్నించింది... రాజా భార్య షాపింగ్ కు వెళ్ళింది అని, రాజా నో పార్కింగ్ లో కార్ పార్క్ చేశారు అని, ఈ క్రమంలో ఎస్ఐ వచ్చి, దురుసుగా ప్రవర్తించారని, చేతిలో బిడ్డ ఉన్నా, ఎస్ఐ కొట్టారు అంటూ, కట్టు కధ అల్లింది... స్టొరీకి ఎమోషనల్ టచ్ ఇవ్వటంతో, వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయి, పోలీస్ స్టేషన్ తగలబెట్టే యత్నం చేశారు.. నిజానికి, వీడియోలో స్పష్టంగా, అతని భార్య చంటి బిడ్దతో కలిసి కార్ లోనే ఉన్నారు... రాజా బయట, పోలీస్ తో గొడవ పడుతున్నారు... అయినా, వైసిపి, సాక్షి తప్పుదోవ పట్టించి, అక్కడ ఉన్న అనుచరులని రెచ్చగొట్టారు... అయితే ముందు నుంచి జక్కంపూడి రాజా పై పలు అభియోగాలు ఉన్నాయి... 2007 11 మంది జర్నలిస్ట్ లను కొట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు... ఇతని ఆగడాలు భరించలేక రాజమండ్రి నుంచి, ఇతన్ను పోలీసులు కొన్ని నెలలు వెలి వేసిన చరిత్ర కూడా ఉంది... 2015లో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి, అతని మనుషులని విడిపించుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేశాడు...