నిన్న చంద్రబాబు పై రాళ్ల దా-డి , తదనంతర పరిణామాలు, చంద్రబాబు ధర్నా, ఎప్సీ ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్ళటం, ఈ రోజు టిడిపి నేతలు గవర్నర్ ను కలవటం, అలాగే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటం, ఇవన్నీ జరుగుతున్న నేపధ్యంలో, తిరుపతి పోలీసులు పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వారు స్వయంగా రంగంలోకి దిగి, చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు ఈ రోజు ఉదయమే వచ్చారు. నిన్న జరిగిన సంఘటన పై చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది, ఆయన వ్యక్తిగత సిబ్బంది నుంచి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు దా-డి ఎలా జరిగింది, ఏమి జరిగింది అనే విషయాల పై ఆరా తీసుకున్నారు. ఇక మరో పక్క, టిడిపి ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యానం తరువాత, కేంద్ర ఎన్నికల కమిషన్ తో భేటీ కానున్నారు. కేంద్ర ఎన్నికల కమీషనర్ గా సుషీల్ చంద్ర, ఈ రోజే బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సునీల్ అరోరా, నిన్నటితో పదవీ విరమణ చేసారు. కొత్త సిఈసిగా సుషీల్ చంద్ర బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ ఉండటంతో, ఇంకా ఆయన అప్పాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదని, టిడిపి వర్గాలు అంటున్నాయి. మధ్యానం రెండు గంటల తరువాత, అప్పాయింట్మెంట్ ఇచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది.

attack 13042021 2

ఇప్పటికే చెన్నై నుంచి బయలేదేరిన ఎంపీలు, మరి కొద్ది సేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల ఢిల్లీ కు వెళ్ళిన వారిలో ఉన్నారు. నిన్న జరిగిన ఘటన పై, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని, వారి పై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. డీజీపీ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మనిషికే రక్షణ లేకపోతే, ఇక ఎన్నికలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే అని టిడిపి నేతలు అంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘటనలు అన్నీ కూడా వీడియోల రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చూపించి, ఈ ఉప ఎన్నికలో కూడా అరాచకం చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే కేంద్ర బలగాలతో, ఇక్కడ ఎన్నిక జరిపించాలని కోరనున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయటం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ గమనించి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా చూడాలని ఫిర్యాదు చేయబోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read