టిటిడి పై తప్పుడుగా, అనవసరంగా పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాసినా, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సహించేది లేదంటూ టిటిడి పాలకమండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమలలో మీడియాకు వెల్లడించిన 24గంటల్లో శనివారం పోలీసు కేసులు నమోదు కావడం విశేషం. ఇప్పటికే టిటిడిలో జరుగుతున్న అంతర్గత విషయాలను బయట మీడియాకు , రాజకీయ నాయకులకు చేరవేస్తున్న ఉద్యోగులపై కూడా టిటిడి విజిలెన్స్ అధికారులు నిఘా వుంచారు. ఈ నేపధ్యంలో శనివారం టిటిడిపై దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై తిరుమల టౌన్ పోలీసు స్టేషన్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. వీరిలో ముఖ్యంగా తమిళనటుడు సూర్య తండ్రి శివకుమార్ వుండటం చలనచిత్ర రంగంలో సంచలనంగా మారింది. అలాగే హీరో సూర్య, జగన్ కు అనుకూలంగా ఉంటారు. ఆయన జగన్ కంపెనీ అయిన, భారతీ సిమెంట్స్ కు, ఆడ్స్ కూడా చేసారు. అలాంటి సూర్య తండ్రి పై, తిరుమల అధికారులు సీరియస్ అయ్యారు, ఎంతటి వారినైనా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు.

ఇటీవల టిటిడి ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణ మూర్తి రాజీనామా చేశారని ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి అసత్య ప్రచారం జరిగింది. దీనిపై టిటిడి విజిలెన్స్ ఫిర్యాదుతో టౌన్లో కేసు నమోదైంది. తమిళనాడులో ఓ సమావేశంలో నటుడు శివకుమార్ తిరుమలలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని , తిరుమలకు వెళ్లవద్దని చేసిన వ్యాఖ్యలు వీడియో రూపంలో హల్ చల్ చేసింది. వీడియోలో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ తమిళ మయ్యన్ అనే వ్యక్తి ఇమెయిల్ ద్వారా టిటిడికి చేసిన ఫిర్యాదుపై శివకుమార్‌పై కేసు నమోదైంది. అలాగే కరోనా లా డౌన్ ఆంక్షల నేపధ్యంలో ఏకంగా జూన్ 30వరకు తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు నిలిపివేస్తారంటూ తిరుపతి వార్త (స్థానికవత్రిక) వార పత్రికకు చెందిన మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్, ముంగరశివరాజు, గోదావరి న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేశారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో భక్తులను గందరగోళానికి గురిచేశారని టిటిడి ఫిర్యాదుతో తిరుమల టౌన్ పోలీసులు ఎపిడమిక్ డిసీసెస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు.

 

అంతేగాక మే 1వతేదీ ఫేస్ బుక్ లో తిరుమల శ్రీవారికి సంబంధించిన అవాస్తవ సమాచారాన్ని పోస్టుచేశారు. ఒకానొకప్పుడు తిరుమల ఆలయం భౌద్దారామం అని, తలనీలాల సమర్పణ హిందువుల సంప్రదాయం కాదని , బౌద్ధులకు చెందిందని అందులో పేర్కొన్నారు. తిరుమల ఆలయంలో వున్న బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహంగా మార్చారని ఫేస్ బుక్ లో సమాచారాన్ని పొందుపరిచారు. ఈ పోస్టు పెట్టిన వారిపై సైబర్ క్రైమ్ క్రింద కేసులు నమోదయ్యా యి. ఇదిలా వుండగా ఇప్పటికే గత రెండునెలలకాలంలో టిటిడిపై దుష్ప్రచారాలపై తిరుమల పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఇంకా పాతకేసులు కూడా దర్యాప్తులోనే వున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read