ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై ఒక ప్లాన్ ప్రకారం ఇబ్బందులు సృష్టిస్తున్న వేళ, బెజవాడ కనకదుర్గమ్మ రధానికి ఉండే వెండి సింహాల మాయం, సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం ఈ కేసు పై ప్రత్యెక దృష్టి పెట్టింది. పోలీసులు కూడా ఈ కేసుని చేదించే పనిలో పడినా, ఆధారాలు చిక్కినట్టే చిక్కి, మళ్ళీ చిక్కుముడులు వస్తున్నాయి. పోలీసులు పురోగతి సాధిస్తున్నారు అనుకునే సమయంలో, ఏదో ఒక ఇబ్బందితో, మళ్ళీ విచారణకు ఇబ్బందులు వస్తున్నాయి. రధానికి ఉన్న వెండి సింహాల మాయం పై, పోలీసులు దృష్టి పెట్టి, ఈ సింహాలు ఈ ఏడాది జూన్ లో మాయం అయినట్టు గుర్తించారు. అయితే కీలకమైన ఈ ఆధారం దొరకటంతో, పోలీసులు ఆసల దొంగలను త్వరలోనే పట్టేసుకుంటారని భావించిన సమయంలో, తదుపరి ఆధారాలు దొరక్క పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు జరిగిందో గుర్తించారు కాబట్టి, ఎవరు చేసారో ఇట్టే కనిపెట్టేయవచ్చని అనుకున్న సమయంలో, తాజాగా పోలీసులు ఎటువంటి ఆధారాలు దొరక్క పోవటంతో, విచారణ అక్కడే ప్రస్తుతానికి ఆగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో, ఎలాగైనా తొందరగా విచారణ చేసి, ఒక కొలిక్కి తెద్దామని పోలీసులు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావటం లేదు.

ఘటన జరిగిన చోటు నుంచి ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాల ప్రకారం, వారు ఇచ్చే రిపోర్ట్ లో కీలకమైన అంశాలు దొరుకుతాయని పోలీసులు భావించారు. కానీ తాజాగా ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ లో, పోలీసులకు కావలసిన ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవటంతో, ఎలా ముందుకు వేళ్ళలో పోలీసుల అర్ధం కాక, విచారణలో కొత్త దారులు వెతుకుతున్నారు. జూన్ లో మాయం అయ్యాయి అని ఆధారాలు దొరకటంతో, ఈ కేసు విచారణ తొందరగా ముగిసిపోతుందని భావించినా, తదుపరి ఆధారాలు దొరక్కపోవటంతో, కేసు విచారణలో వేగం తగ్గింది. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంలో జరిగిన ఘటన కావటంతో, పోలీసులు కూడా ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు. ఆరు బృందాలు, ఈ కేసు పై విచారణ చేస్తున్నాయి. దాదాపుగా 100 మందికి పైగానే ఇప్పటి వరకు విచారణ చేసారు. మరో పక్క ఈ విషయం పై రాజకీయ దుమారం కూడా రేగింది. ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాయి. ఈ నేపధ్యంలో, ఈ కేసు తొందరగా ఒక కొలిక్కి తీసుకు రావాలని పోలీసులు భావిస్తున్నా, విచారణ నెమ్మదించింది. తొందర్లోనే అసలు దొంగలను పోలీసులు పట్టుకుంటారని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read