తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు తిరుపతిలోని అలిపిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలిపిరిలోని అంకుర హాస్పిటల్ రోడ్డు దగ్గర పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. విద్యార్థులతో ముఖాముఖి ప్రోగ్రాం కి వెళ్తున్న లోకేష్ ను పోలీసులు అడ్డగించారు . ఆ కార్యక్రమానికి ముందుగా పర్మిషన్ తీసుకోలేదని, కావున ఆ కార్యక్రామానికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ పోలీసులు అడ్డగించారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని వారు చెప్పారు. దీనిపై టిడిపి నేతలు స్పందిస్తూ ,పోలీసుల ఉద్దేశపూర్వకం గానే ఇలా అడ్డగిస్తున్నారని మండిపడ్డారు. ఇలా అడుగడుగునా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవటమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని , దీనికోసమే వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకుని, ఇలాంటి చర్యలాకు పాల్పడుతున్నారని టిడిపి శ్రేణులు ద్వజమెత్తారు. ఇక ఈ రోజు తిరుపతిలో లోకేశ్‌కు పాదయాత్రపై టెన్షన్.. నెలకొంది. తిరుపతి నగర వీధుల్లో పాదయాత్రకు అనుమతి లేదంటున్న పోలీసులు, భారీగా మొహరించాయి. పది రోజుల క్రితమే అడ్మిన్ ఎస్పీని కలిసి రూట్ మ్యాప్ ఇచ్చామని, ఇప్పుడు అభ్యంతరం తెలపటం పై, టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైసీపీ నేతల ఒత్తిడితోనే పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని, పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నగరవీధుల్లోనే పాదయాత్ర కొనసాగుతుందని టిడిపి నేతలు తేల్చి చెప్పారు
ఈ రోజు తిరుపతిలో లోకేష్ పాదయాత్ర పై టెన్షన్ టెన్షన్... ఇప్పటికీ నోటీసులు ఇచ్చి, దిగిన వందలాది పోలీసులు
Advertisements