పోలీసు అధికారుల సంఘం చేసిన ప్రకటన నేర పోలీసుల్ని రక్షించుకోవడానికి చేసిన ప్రకటనలావుందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... గుంటూరు జిల్లా ఏటి అగ్రహారంలో రమేష్ అనే అతను మైనర్ బాలికపై అ-త్యా-చా-రం చేస్తే బాలిక కుటుంబీకులు రమేష్ కు దే-హ-శు-ద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం పత్రికల్లో వచ్చింది. దీన్ని చూసి స్పందించిన నారా లోకేశ్ శాం-తి-భ-ద్ర-త-లు కరువవుతున్నాయని, రోజూ ఏదో ఒక చోట అ-త్యా-చా-రా-లు జరుగుతున్నాయని, రక్షకులే బక్షకులౌతున్నారని మాట్లాడారు. ఇందులో పోలీసులకు తప్పు కనపడింది. పోలీసులే నేరస్థులయితే పోలీసు అధికారుల సంఘం వారిని వెనకేసుకరావడంలో అర్థం లేదు. పోలీసు అధికారులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే వారు మాట్లాడాలి. పోలీసు ఉద్యోగస్థులకు రావాల్సిన రాయితీలు, పెన్షన్లు రానప్పుడు, ట్రాన్స్‌ఫర్లలో ఎక్కడైన అవినీతి జరిగినప్పుడు మాత్రమే వారు మాట్లాడాలి. సభ్యసమాజం తలదించుకునే పనిచేసిన ఓ పోలీసును వెనకేసుకురావడం తగదు. లోకేశ్ మాట్లాడటంలో అర్థముంది. పోలీసు వ్యవస్థని నీరుగార్చిన విధంగా లోకేశ్ మాట్లాడారని పోలీసు అధికారుల సంఘం నాయకులు మాట్లాడడంలో అర్థంలేదు. ఆయన స్పందించాల్సిన అవసరముంది కాబట్టి స్పందించారు. పత్రికల్లో, టీవీల్లో వస్తే చూసి మాట్లాడారే తప్ప ఆయన స్వయంగా ఏమీ కల్పించుకొని మాట్లాడలేదు. దాన్ని పోలీసు అధికారుల సంఘం నాయకులే చిలవలు, వలువలు చేస్తున్నారు. స్పందించాల్సిన వారే నేరస్థుడిని వెనకేసుకు రాకూడదు. నేర పోలీసులపట్ల అనుకూలంగా ఉండాలని ఎక్కడా లేదు. నేరస్థుడు నేరమే చేయనప్పుడు అతడిని సస్పెండ్ ఎందుకు చేశారు? అతనిపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకున్నారు? సామాన్య పౌరుడు నేరం చేసివుంటే ఇలా స్పందించేవారు కారుకదా? సమాజంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఫలానావారికి ఫలానా వారు ఇబ్బందులపాలు చేశారని సమాజానికి తెలియపరచడం తప్పుకాదు.
మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసు అధికారుల సంఘం మాట్లాడటంలో అర్థంలేదు. దీన్నిబట్టి బాధితురాలి తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని అర్థమవుతోంది. పోలీసు వ్యవస్థలో ఉన్నవారు బెదిరించకూడదు. నేరస్థుడిని శిక్షించాలి. ఫిర్యాదు రాలేదంటున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి ఎవరైనా భయపడతారు. భయపడకుండా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయమని వారిలో మనో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత పోలీసు అధికారులకు ఉంటుంది. అలాంటిది ఈ సంఘటన బాధితురాలి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయవద్దని సూచించిట్లుంది. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలి. పోలీసులకొక చట్టం, సామాన్య పౌరులకు ఒక చట్టం ఉండకూడదు. డీజీపీనే ఏకపక్షంగా వ్యవహరిస్తు్న్నారు. ఆయన రాజకీయలు మాట్లాడకూడదు. టీడీపీలో ఉద్యోగాలు రాలేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలొచ్చాయని మాట్లాడారు. డీజీపీ టీడీపీ కార్యకర్తల్ని, సామాన్య పౌరుల్ని ఒకలా, వైసీపీ కార్యకర్తల్ని మరోలా చూడటంతో ఆయన కోర్టు బోనెక్కి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు అధికారులు తమ ప్రతిష్టను దిగజార్చుకోవద్దు. దిశ చట్టం లేనేలేదని, పార్లమెంటులో ఈ చట్టంకు ఆమోదం లేదని స్వయాన మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మగారే చెప్పారు. పోలీసు సంఘ నాయకులు గౌరవంగా ఉండాలి. చట్టాల్ని తమ చుట్టాలుగా మార్చుకోవద్దు. నారా లోకేశ్ మహిళలకు భరోసా ఇస్తున్నట్లుగా మాట్లాడారే తప్ప కించపరచేలా ఎక్కడా మాట్లాడలేదు. అధికారులు అధికారుల్లా ఉండాలే తప్ప రాజకీయ నాయకుల్లా ఉండకూడదు. పోలీసు అధికారుల సంఘం నారా లోకేశ్ గారిపై తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలి. పోలీసుల సంక్షేమం కోసం పాటుపడాల్సిందిగా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వివరించారు.