అమరావతిలో, ఈ రోజు అసెంబ్లీ ముట్టడి ఉండటంతో, ఈ రోజు విజయవాడలో కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈ రోజు ప్రకాశం బ్యారేజి పూర్తిగా మూసేస్తారు. ఇది పోలీస్ వారి ప్రెస్ నోట్... "తేది.19-01-2020. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కారణంగా ప్రకాశం బ్యారేజ్ప వాహనాల రాకపోకలు నిషేధం. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ప్రయాణించే వాహనాల ట్రాఫిక్ మళ్ళింపు ది. 20.01.2020న అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఇతర రాజకీయ పార్టీలతో కలసి తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ప్రకాశం బ్యారేజీపై అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక (సీతమ్మవారి పాదాలు), కుమ్మరిపాలెం మరియు ఒటౌన్ ప్రాంతాల వైపు నుండి మరియు తాడేపల్లి మరియు సీతానగరం వైపు నుండి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు సాగించే అన్ని రకాల వాహనాలను ఈ క్రింది విధంగా మళ్లించడం జరుగుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ పై పాదాచారుల రాకపోకలను కూడా నిషేధించడం జరుగుతుంది.
ట్రాఫిక్ మళ్ళింపు చర్యలు : - గొల్లపూడి, కుమ్మరిపాలెం మరియు ఒటౌన్ ప్రాంతాల నుండి వచ్చే అన్ని రకాల వాహనాలు గొల్లపూడి వద్ద నుండి సితార సెంటర్, సి.వి.ఆర్, ప్లైఓవర్, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్ మీదుగా పంజా సెంటర్, రైల్వే వెుకింగ్, ఆర్.టి.సి. టెర్మినల్, లోబ్రిడ్జి, ప్రకాశం బొమ్మ, పోలీస్ కంట్రోల్ రూమ్, బందరు లాకులు మీదుగా 9వ నెంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడ నుండి కనకదుర్గ వారధి మీదుగా ప్రయాణించాలి మరియు భవానీపురం, ఆర్టీసీ వర్క్ షాపు రోడ్లు, భవతీకాటా, సితార, సి.వి.ఆర్. ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణించాలి. ఏలూరు రోడ్డు మరియు బందరు రోడ్డు వైపు నుండి వచ్చే అన్ని రకాల వాహనాలు బందర్ లాకుల మీదుగా 9వ నెంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడి నుండి కనకదుర్గ వారిధి మీదుగా ప్రయాణించాలి. గుంటూరు, తాడేపల్లి, సీతానగరం వైపు నుండి వచ్చే వాహనాలను మరియు పాదచారులను ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను అనుమతించబడవు. హైదరాబాద్ నుండి వచ్చు లారీలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా ప్రయాణించాలి. అదే విధంగా ది.20.01.2020 నుండి ది. 23.01.2020 వరకు ఎటువంటి భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వైపు నుండి విజయవాడ నగరంలోకి అనుమతించబడవు.
పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి భవానీపురం వెళ్ళు వారు సీతమ్మ వారి పాదాలు, వినాయక టెంపుల్, కాళేశ్వరరావు మార్కెట్, పంజా సెంటర్, వి.జి. చౌక్, చిట్టినగర్, సితార మీదుగా భవానీపురం ప్రయాణించాలి. హనుమాన్ జంక్షన్ నుండి ఎటువంటి భారీ వాహనాలను విజయవాడ నగరంలోనికి అనుమతించబడవు. మచిలీపట్నం నుండి చెన్నై వెళ్ళు వారు పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు మీదుగా ప్రయాణించవలెను. చెన్నై నుండి మచిలీపట్నం వెళ్ళు ఒంగోలు, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా ప్రయాణించవలెను. గుంటూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిరియాలగూడ, నార్కెట్పల్లి మీదుగా ప్రయాణించవలెను. హైదరాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్ళు వాహనాలు నార్కెట్పల్లి, మిరియాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా ప్రయాణించవలెను. మచిలీపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు మచిలీపట్నం, పామర్రు, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం , సూర్యాపేట మీదుగా ప్రయాణించవలెను. హైదరాబాద్ నుండి మచిలీపట్నం వైపు వెళ్ళు వాహనాలు హైదరాబాద్, ఖమ్మం, వైరా, కల్లూరు, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, పామర్రు మీదుగా ప్రయాణించవలెను. కావున పైన పేర్కొన్న ట్రాఫిక్ మళ్ళింపు చర్యలను ప్రజలు మరియు వాహన చోదకులు గమనించి ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.