అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం, 27వ రోజుకు చేరుకుంది. వీరి పోరాటానికి, రోజు రోజుకీ మద్దతు పెరుగుతుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల వారి నుంచి వీరికి మద్దతు వస్తుంది. ఇప్పటికే అమరావతి జేఏసీ చేస్తున్న ర్యాలీలు, సూపర్ హిట్ అవుతున్నాయి. చివరకు రాయలసీమలో కూడా, అమరావతి కోసం చేస్తున్న ర్యాలీలు సూపర్ హిట్ అవుతున్నాయి. వారం రోజులు క్రిందట గుంటూరులో మహిళలు అందరూ, అమరావతికి మద్దతుగా ర్యాలీలు చేసారు. ఈ ర్యాలీ పెద్ద సెన్సేషన్ అయ్యింది. దాదపుగా 5 వేల మంది మహిళలు పాల్గున్నారు. ఇదే స్పూర్తితో మూడు రోజులు క్రిందట, విజయవాడలో కూడా మహిళా ర్యాలీ చెయ్యాలని, విజయవాడ మహిళలు అందరూ అనుకున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేస్తామని, పోలీసులని పర్మిషన్ అడిగారు. అయితే గుంటూరులో వచ్చిన స్పందన చూసి ప్రభుత్వం భయపడిందో ఏమో కాని, విజయవాడ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే బందర్ రోడ్డు కాకుండా, వేరే రోడ్డులో చేస్తామని పర్మిషన్ అడిగారు.

vijayawada 13012020 2

పోలీసులు దానికి కూడా ఒప్పుకోలేదని జేఏసీ సభ్యులు చెప్పారు. దీంతో విజయవాడ మహిళలు పోలీసులు నిర్బంధాలు ఉన్నా సరే, మహిళా ర్యాలీ చేసి తీరు తామని, అమరావతికి మా మద్దతు తెలుపుతామని, రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తాము ముందుకు వెళ్తామని, ఆ రోజు రోడ్డు పైకి వచ్చారు. మహిళలు రోడ్డు పైకి రాగానే, పోలీసులు అరెస్ట్ లు చేసేసారు. ఎంత మంది రోడ్డు ఎక్కితే అంత మందిని అరెస్ట్ చేసారు. మహిళలు పోలీసులు వ్యూహాన్ని చేధించి, PWD గ్రౌండ్స్ నుంచి ర్యాలీ చేసారు. కొంత మంది బెంజ్ సర్కిల్ నుంచి చేసారు. ఇలా పోలీసులకు చెమటలు పట్టించి, అమరావతికి మద్దతు తెలిపారు. అయితే, పొలీసులు మహిళలను ప్రివెంటివ్ అరెస్ట్ అని అరెస్ట్ చేసి, వారి వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. చివరకు కులం కూడా అడిగారు.

vijayawada 13012020 3

కొంత మందిని సాయంత్రం 6 గంటలకు వదిలితే, మరి కొంత మందిని, 9 గంటలకు వదిలారు. అయితే, ఇప్పుడు ఈ మహిళలు అందరికీ షాక్ ఇచ్చారు విజయవాడ పోలీసులు. ఈ ర్యాలీలో పాల్గున్న వందల మంది పై, పోలీసులు కేసు నమోదు చేసారు. సెక్షన్ 353, 143, 147, 188, 290, సెక్షన్ 32 కింద కేసులు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా, మహిళలపై నమోదైన కేసులపై పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి పోలీసులు నివేదిక పంపించారు. పాసుపోర్టులు రద్దు అవుతాయని పోలీసులు బెదిరిస్తున్నారని మహిళలు అంటున్నారు. చాలా మంది యువత ఉన్నారని, విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని, వారి భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేశారని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని మహిళలు చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read