ఒక పక్క భీమ్లా నాయక్ సినిమాకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతున్న సందర్భంలో, ఇప్పుడు పూనం కోర్ ఎంట్రీతో, ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో మరో టాపిక్ అయ్యింది. నిన్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలేజ్ ఫంక్షన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ అయిన దగ్గర నుంచి, పూనం కౌర్ వేస్తున్న ట్వీట్లు సంచలనంగా మారాయి. ఎవరి పేరు ప్రస్తావించక పోయినా, అందులో అర్ధాలు తెలిసిపోతున్నాయి. అయితే కొన్ని ట్వీట్స్ ను ఆమె ఎందుకో కానీ ఆమె డిలీట్ చేస్తున్నారు. రాజకీయాలు ఎంటర్టైన్మెంట్ అయ్యాయి, ఎంటర్టైన్మెంట్ రాజకీయంగా మారిపోయింది అంటూ ఆమె ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ వైరల్ అవుతున్న నేపధ్యంలో, ఆమె ఆ ట్వీట్ ను డిలీట్ చేసారు. అయినా ఆ స్క్రీన్ షాట్ అప్పటికీ వైరల్ అయ్యింది. అది ఎవరిని ఉద్దేశించి చేసారో కానీ, ఆమె టార్గెట్ పవన్ కళ్యాణ్ అని, ఆమె తరువాత వేసిన ట్వీట్స్ చూస్తే అర్ధం అవుతుంది. నేను ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తులు, రాజకీయ నాయకులు ముందు, వాళ్ళను తక్కువ చేసుకుని, చేతులు జోడించి, చేతులు కట్టుకుని ఉండటం చూసి బాధ వేసిందని, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారు, అవసరాల కోసం వ్యక్తిత్వాలు చంపుకుని బ్రతకనవసరం లేదని, ఆమె ట్వీట్ చేసారు. అయితే కొద్ది సేపటికి ఆ ట్వీట్ కూడా డిలీట్ చేసారు.
అయితే ఈ ట్వీట్ మాత్రం చిరంజీవిని ఉద్దేశించి అని అర్ధం అవుతుంది. ఇక్కడ జగన్ ను టార్గెట్ చేసినట్టు ఉండటంతో, ఆమె అది డిలీట్ చేసారు. ఇక రాం గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ స్పీచ్ ని షేర్ చేసిన ట్వీట్ ని కోట్ చేస్తూ ఆమె మరో ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ అయతే డిలీట్ చేయలేదు. ఒక డైరెక్టర్ అతని వ్యక్తిగత జీవతం పైన దారుణంగా వ్యాఖ్యానించి, అతని పక్కన నుంచుని నవ్వుతున్నాడు. మరో డైరెక్టర్, రాజకీయంగా ఆడుకుంటూ, ట్విట్టర్ లో నవ్వుతున్నాడు. ఇద్దరూ అమ్మాయిని ఆయుధంగా పెట్టుకుని, డబ్బుకు అద్దెకు తీసుకున్న ఏజెంట్లు అంటూ, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాం గోపాల్ వర్మ వైసీపీ అజేంట్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె త్రివిక్రమ్ ని కూడా ఇందులోకి లాగటం సెన్సేషన్ అయ్యింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద క్రైమ్ ఏంటి ? మనం దాని గురించి మాట్లాడటం మానేసి, పెళ్ళిళ్ళ పై మాట్లాడుతున్నాం అంటూ, పరోక్షంగా జగన్ పరిపాలను కూడా టార్గెట్ చేస్తూ ట్వీట్ లు వేసారు. ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.