ఈమె, ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్... రెండు నెలల క్రితం వైజాగ్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో, ముఖ్యమంత్రి పూనం కౌర్ తో మాట్లాడి, ఆమెను రాష్ట్రానికి చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసడర్ గా నియమించారు... అయితే, మన తెలుగు వారిని పెట్టకుండా, ఎక్కడ నుంచో వచ్చిన వారిని పెట్టుకోవటం ఏంటి అనే విమర్శలు వచ్చాయి... నిజానికి, మన హైదరాబాద్ సినీ హీరోలకు, మిగతా నటులకు మన రాష్ట్రం అంటే చిన్న చూపు.. అనేక సందర్భాల్లో అది చూసాం... నిన్న కాక మొన్న నందుల గోల కూడా చూసాం... అలాంటి వారి కంటే, ఈమె చాలా నయం...
నెల రోజుల క్రిందట ఆమెకు అప్పగించిన బాధ్యత కోసం, ఏకంగా ఆమె పుట్టిన రోజు నాడే రంగలోకి దిగారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి వచ్చిన ఆమె చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారి మధ్యే పుట్టిన రోజు జరుపుకున్నారు... నిన్నా తాజాగా ఆమె మరో సారి, ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసడర్ పాత్ర పోషించారు.. పూనమ్ శుక్రవారం అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామాను కలిశారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం న్యూదిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనమ్ ఆయన్ను కలిసి ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలను బాహుమతిగా ఇచ్చారు...
ఇది మన అనుకునే హైదరాబాద్ లో ఉండే తెలుగు హీరోలకి, ఎక్కడ నుంచో వచ్చి మన కోసం ప్రచారం చేస్తున్న పూనమ్ కౌర్ కి తేడా... మన రాష్ట్రం అంటే కనీసం ప్రేమ లేని వారికి, మన రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ అంబాసడర్ హోదా ఎందుకు ఇవ్వాలి ? అందుకే ఎక్కడ నుంచో వచ్చిన పూనం కౌర్ ని చేనేత బ్రాండ్ అంబాసడర్ చేశారు చంద్రబాబు... తప్పేముంది, దీంట్లో... ఎక్కడి నుంచో వచ్చిన పూనం కౌర్, మన రాష్ట్రంలోని ఒక మారు మూల ఊరిలో తన పుట్టిన రోజు వేడుకులు, చేనేత కార్మికలు కష్టాలు తెలుసుకుంటూ జరుపుకున్నారు, ఇవాళ అమెరికా మాజీ అధ్యక్షుడికి మన చీనేత వస్త్రాలు బహుకరించారు... మరి మాన హైదరాబాద్ సినిమా బ్యాచ్ కంటే, ఈవిడ చాలా నయం కదా...