ముఖ్యమంత్రి అవ్వటమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, అస్త్ర సస్త్రాలు బయటకు తీస్తున్నారు... అక్కడ ఏమున్నాయి అంత చేటు అస్త్రాలు అంటారా... ఇప్పుడు ఇంకో అస్త్రం బయటకు వచ్చింది... అయితే, ఈ అస్త్రం కూడా రోజా, కొడాలి నాని లాంటి అస్త్రాలతో సమానంగా ఉంటుంది... ఆ అస్త్రం ట్రాక్ రికార్డు అలాంటిది... ఈ అస్త్రానికి కూడా పవర్ఫుల్ లెగ్ అనే ట్యాగ్ ఉంది.. మిగతా రెండు అస్త్రాలు లాగే, ఈ అస్త్రం కూడా బూతులు మాత్రమే మాట్లాడుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది... దీనికి ఎక్స్ట్రా క్వలిఫికేషన్ ఏంటి అంటే మెంటల్ కూడా కొంచెం ఉంది (అది వారు చెప్పుకుందే)... ఈ అస్త్రం కూడా, చంద్రబాబుని తిట్టటమే పని.... ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా, అందుకే ఈ అస్త్రం ఎన్నికలు అయ్యేదాకా దాకా కాంట్రాక్టు కుదుర్చుకుని రంగంలోకి దిగింది... ఆ అస్త్రం పేరే మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని మురళి కృష్ణ...
అయ్య వారు ఈ మధ్య నాకు జగన్ అంటే ఇష్టం, చచ్చే వరకు జగన్ తోనే అన్నారు... అప్పట్లో 2004లో చంద్రబాబుని, 2009లో చిరంజీవిని కూడా ఇలాగే అన్నారు అనుకోండి... ఇప్పుడు చంద్రబాబుని ఎన్నికల్లో దెబ్బ తియ్యటానికి , హైదరాబాద్ లో కూర్చుని రాళ్ళు వేస్తున్నారు. దీని కోసం చంద్రబాబు పై సినిమా తీస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ, రాం గోపాల్ వర్మ చేత ఒక సినిమా తీపిస్తున్న జగన్, ఇప్పుడు ఇంకో సినిమా కూడా రెడీ చేస్తున్నారు. అయితే, ఇది ఎన్నికల సీజన్ కావటంతో, ఇలాంటి విష సంస్కృతిని ఎలక్షన్ కమిషన్ తోసిపోచ్చుతుంది. అటు రాంగోపాల్ వర్మకి ఎలాంటి షాక్ ఇచ్చిందో, పోసాని కూడా అలంటి షాకే ఇచ్చింది. దీని పై ఈ రోజు పోసాని ప్రెస్ మీట్ పెట్టి, తన బాధ వెళ్లగక్కారు.
తాను తీస్తున్న ‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ సినిమాలో ఎవరినీ తిట్టలేదని విలక్షణ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. సినిమాను ఆపేయాలంటూ ఎన్నికల సంఘం నుంచి లేఖ రావడంతో పోసాని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరో మోహన్‌రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే తన సినిమాను ఈసీ నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమా తీశానని పోసాని చెప్పారు. మేనిఫెస్టోలోని అంశాలనే సినిమాలో చూపించానన్నారు. ఎన్నికల కమిషనర్ మార్కండేయులు తనకు లేఖ పంపించారని, అందుకు సమాధానంగా మూడు పేజీలతో కూడిన వివరణ పంపించానని పోసాని తెలిపారు. సినిమాలో ఏముందో తెలియకుండా లేఖ ఎలా పంపారని ప్రశ్నించారు.