విశాఖ స్టీల్ ప్లాంట్ పై, కుట్ర మొత్తం బయట పడింది. ఏదో చేయబోయి ఏదో చేసినట్టు, అధికార పార్టీ నేత విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నతో, బండారం మొత్తం బయట పడింది. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ నేతలు కారుస్తున్న ముసలి కన్నీరు మొత్తం, తేటతెల్లం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కో కంపెనీకి కట్టబెట్టే విషయం మొత్తం అందరికీ ముందే తెలుసు అని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 2019లోనే ఈ కుట్రకు నాంది పలికినట్టు అర్ధం అవుతుంది. ఈ రహస్యం ఈ రోజు పార్లమెంట్ వేదికగా బట్టబయలు అయ్యింది. ఈ కుట్రలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ లో వంద శాతం డిస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని, తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేసి, పోస్కో అనే కంపెనీ కొత్త స్టీల్ ప్లాంట్ కడుతుంది అనే వాదనలు ఇప్పటికి వరకు బయటకు వచ్చాయి కానీ, దీని పై సరైన ఆధారాలు లేకపోవటంతో, వైసీపీ నేతలు కూడా దొరల్లా బిల్డ్ అప్ ఇస్తూ వచ్చారు. అయితే ఈ వివరాలు, ఈ ఒప్పందం సంగతి ఇప్పుడు ప్రపంచానికి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇది మొత్తం నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు జవాబుగా కేంద్రం చెప్పింది. అసలు పోస్కో గురించి ఏమి తెలియనట్టుగా విజయసాయి రెడ్డి కేంద్రానికి ప్రశ్న వేసారు.

steel 10022021 1

విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పోస్కో చేస్తున్న ఘనకార్యాన్ని రాజ్యసభ సాక్ష్టిగా చెప్పారు. పోస్కో, విశాఖ స్టీల్ ప్లాంట్ మధ్య నాన్ బైండింగ్ ఒప్పందం, 2019లోనే జరిగిందన, ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేసారు. అంతే కాకుండా, ప్లాంట్ లో పోస్కో వాటా 50 శాతం ఉంటుందని స్పష్టం చేసారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ వాటా ఎంత అనేది మాత్రం స్పష్టం చేయలేదు. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వాటా, ఇచ్చే భూముల ధర పైన, ఈ వాటా ఉంటుందనేది స్పష్టం చేసారు. దీనికి సంబంధించి పోస్కో ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి చర్చించదని, చెప్పారు. అయితే పోస్కో ప్రతినిధులు అక్టోబర్ 2019న జగన్ ను కలిసి, స్టీల్ ప్లాంట్ పెడుతున్నట్టు చెప్పారు. అంటే మంత్రి సమాధానాన్ని బట్టి చూస్తే, ఈ పోస్కో విషయం, జగన్ మోహన్ రెడ్డికి ముందే తెలుసు అని అర్ధం అవుతుంది. అన్నీ తెలిసి కూడా, ఏమి తెలియనట్టు నటిస్తున్న వైసీపీ నేతలకు ఇది చెంపపెట్టు అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read