నిన్న కొత్తూరు తాడేపల్లిలో జరిగిన సంఘటనతో, గో ప్రేమికులతో పాటు, సామాన్యులు కూడా చింతించే పరిస్థితి. ఒకేసారి 100 ఆవులు చనిపోవటంతో, అందరూ బాధ పడుతున్న వేళ, అసలు ఎందుకు ఇన్ని ఆవులు చనిపోయాయి అనే విషయం తెలుసుకుని, మరింత ఆవేదన కలుగుతుంది. ఆవుల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాధమిక నివేదికలో దారుణమైన నిజాలు బయట పడ్డాయి. ఆవుల మరణానికి విషపదార్థాలే కారణమని ప్రాధమిక నివేదికలో వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించగా, ఆవుల కడుపులో గడ్డి తప్ప మరే ఇతర ఆహారం లేదని వైద్యులు తేల్చారు. అంతే కాదు విష ప్రభావంతో ఆవుల అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందని తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల్లో అక్కడక్కడా రక్తపు చారికలతో ఉన్నాయని తెలిపారు.

cow 11082019 2

అంతే కాకుండా, ఊపిరితిత్తుల్లో భారీగా నీరు చేరినట్టు తెలుసుకున్నారు. విష తీవ్రత ఎక్కవుగా ఉండబట్టే ఆవుల ముక్కల్లో నుంచి రక్తం వచ్చినట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే నిన్న అందరూ భావించినట్టు ఆవుల మృతికి పొట్ట ఉబ్బరం కారణం కాదని పశు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఈ విషం కావాలని పెట్టారా ? లేక ఇంకా ఏమైనా కారణమా అనే విషయం మాత్రం, పోలీసులు దర్యాప్తులో తేలాల్సిందే. ఈ విషయం పై బీజేపీతో పాటు, ఇతర స్వామీజీలు మౌనంగా ఉన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం, రాత్రికి రాత్రే 100 ఆవులు మరణించడం ప్రమాదవశాత్తు జరిగినట్టుగా అనిపించడంలేదని, దీని వెనుక ఎదో కుట్ర కోణం ఉందని అనిపిస్తుందని, దీని పై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

cow 11082019 3

శ్రావణ మాసం అందులోనూ శుక్రవారం.. శ్రవణ శుక్రవారం రోజు, ఇలా వంద ఆవులు చనిపోవటం, రాష్ట్రానికి అరిష్టం అనే వాదన కూడా ఉంది. శ్రవణ శుక్రవారం కావటంతో, గోసాలకు ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు వచ్చారు. గో మాతలకు పూజలు చేసారు. అయితే రాత్రికి ఇలా జరగటంతో, భక్తులు కూడా షాక్ అయ్యారు. గో మాతను పూజించిన చోటే, ఇలా 100 ఆవులు చనిపోవటం పై, వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం యధావిధగా కమిషన్లు వేసింది. దీని పై విచారణ జరుగుతుంది. ఒక పక్క పూర్తీ స్థాయి పోస్టుమార్టం నివేదిక మరో రెండు మూడు రోజుల్లో రానుంది. మరో పక్క, పోలీసులు వారి పని వారు చేసుకు వెళ్తున్నాడు. మరి ఈ దారుణం పై అసలు నిజం తెలుస్తుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read