బేసిన్లు లేక ఎండా.. బేషజాలు లేకుండా చర్చించుకుందామని, ఇచ్చి పుచ్చుకుందామని కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి వాటేసుకుని, ఒకరిని ఒకరు నోట్లో స్వీట్లు తినిపించుకున్న సీన్లు ఇంకా గుర్తున్నాయి. రోజా ఇంటికి పూలు చల్లించుకుంటూ వెళ్ళిన కేసీఆర్, రాయలసీమను రతనాలు సీమ చేస్తానని చెప్పారు. ఏపి అసెంబ్లీలో, కేసీఆర్ ఈజ్ మ్యగ్నానమస్ అని జగన్ మోహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు బేసిన్ల పంచాయతీ పోతిరెడ్డిపాడు సాక్షిగా ఢిల్లీకి చేరింది. తెలంగాణ, ఆం ధ్రప్రదేళ్ల మధ్య నెలకొన్న పోతిరెడ్డిపాడు పంచాయతీ పై త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కృష్ణానదీ యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీని శనివారం ఆదేశించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్ తెలంగాణకు అన్యాయం చేస్తూ అనుమతులు లేకుండా ఏపి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి జీవో జారీ చేసిందంటూ ఫిర్యాదు చేయగా, దీనిపై స్పందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కేఆర్ఎంబికి స్పష్టమైన లేఖ రాశారు.
పోతిరెడ్డిపాడుపై జీవో దాటి ముందుకెళ్ళకుండా ఎపి ప్రభుత్వానికి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని, కొత్త ప్రాజెక్టుకు సంబందించి డిపిఆర్ ఇవ్వమని కోరాలని, 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఉందో లేదో చూడాలని ఆదేశించారు. దీంతో పాటు త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశించాంరు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై, తెలంగాణ ప్రభుత్వం ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడులపై ఫిర్యాదు చేయడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరగ్గా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఎపి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఆ చర్చల్లో కొత్త ప్రాజెక్టులు ఏవి చేపట్టినా కెఆర్ఎంబి, అపెక్స్ కౌన్సిల్ అనుమతితో ముందుకెళ్ళాలని నిర్ణయించారు. అయితే.. ఇపుడు ఎపి ప్రభుత్వ దూకుడుతో మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ వరుస ఫిర్యాదులు జనవరిలోనే తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కెఆర్ఎంబికి పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రతిపాదన పై లేఖ రాశారు.
తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 5తేదీన లేఖ రాసినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించలేదని కేఆర్ఎంబీ తాజాగా రాసిన లేఖలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి ప్రాజెక్ట - రిపోర్టును అందజేయాలని కోరినా స్పందిం చకపోవడం పై కేఆర్ఎంబి ఆగ్రహంగా ఉంది. ఫిబ్రవరి 5 తేదీన కృష్ణా యాజమాన్య బోర్డు రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ నెల 18న కూడా మరో లేఖను పంపించామని, అయినా స్పందన లేదని పేర్కొంది. విభజన చట్టంలోని 11షెడ్యూల్ ఏడో పేరా ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట ల ప్రతిపాదనలను, సాంకేతికపరమైన అంశాలను బోర్డు ఆమోదించాకే చేపట్టాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల కొత్త పథకానికి సంబం ధించి సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను అందజేయాలని జీవో నంబరు 208లో పేర్కొన్న అన్ని అంశాలను సత్వరమే తమకు చేరేలా సమాచారం అందించాలని ఆ లేఖలో కోరింది. కేంద్రప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడం, కేఆర్ఎంబికి ఆదేశాలు ఇవ్వడంతో పోతిరెడ్డిపాడు వివాదం ఆసక్తికరంగా మారింది.