రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు దాటింది. చంద్రబాబు ఓడిపోయి , జగన్ వచ్చారు. చంద్రబాబు ఓడిపోవటం కూడా భారీ తేడాతో సీట్లు కోల్పోయారు. అలా చంద్రబాబుని ఓడించిన ప్రజలు, ఈ 20 రోజుల్లోనే, చంద్రబాబు ఉంటే, ఇలా ఉండేది కాదు అనే పరిస్థితి వచ్చేసింది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా ? కరెంట్ కోతల విషయంలో. గత 5 ఏళ్ళల కరెంట్ కోత అంటే ఏంటో తెలియని పరిస్థితి. అంత సుఖంగా, చంద్రబాబు హాయంలో ఎంజాయ్ చేసిన ప్రజలు, ఇప్పుడు 20 రోజులకే ఆపసోపాలు పడుతున్నారు. ఒక పక్క జూన్ మూడవ వారం వచ్చినా, చినుకు పడక, వేసవిని మించిన వాతావరణం. వేసవి వడగాడ్పులు అధికంగా ఉండటం ఒక వైపు, రాష్ట్రంలో పలుచోట్ల కరెంటు కోతలు ఒక వైపుతో ప్రజలు అల్లాడి పోతున్నారు. జూన్ మూడవ రం వచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదుసరి కదా, దీనికి తోడు వడగాడ్పులు తోడు కావడంతో ప్రజలకు నరకం కనిపిస్తుంది. దీనితో విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోయింది.
అంచనాలకు మించి విద్యుత్ వినియోగం పెరగడంతో, కొన్నిచోట్ల అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ వాడకం అధికంగా ఉండటంలో రాత్రిళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో సరఫరా ఆగిపోతోంది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ నుంచి మారు మూల పల్లెల దాకా ఈ అనుభవం ఎదురవుతోంది. ఇక విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు చనిపోవటం కలవరం రేపింది. వెంటిలేటర్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కరెంట్ కోత వల్ల మరణించారని, సకాలంలో జనరేటర్ వేయకపోవడం కారణమని ఆందోళన చేసారు. ఇక ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అవ్వటం కూడా మరో కారణంగా అధికారులు వాపోతున్నారు. అయితే గత 5 ఏళ్ళు, వేసవి కాలంలో, ఈ సమస్య ఎప్పుడూ ఎదురు కాలేదని, చంద్రబాబు ఉంటే, కరెంటు కష్టాలు ఉండేవి కాదంటూ, ప్రజలు అనుకుంటున్నారు.