ఇప్పటికే కరెంటు కూతలతో సతమవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో, విద్యుత్ పీపీఏల విషయంలో, కేంద్రంతో గొడవ పెట్టుకున్న సందర్భంలో, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో, రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వివిధ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ, వాటికి చెల్లింపులు చెల్లించకుండా, వందల కోట్లుకు బాకాయి పెడుతున్న ప్రభుత్వానికి, కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి డబ్బులు చెల్లిస్తాం అని లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే, విద్యుత్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది వరుకే ఈ ఆదేశాలు ఇవ్వటంతో, దాదాపు వారం పాటు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజగా సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు కూడా ముందస్తు చెల్లింపులకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వాలని, కేంద్రం ఆదేశించింది. రెండు రోజుల్లో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.

jagan 15102019 2

లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వని సందర్భంలో, జాతీయ విద్యుత్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయకుండా, ఎక్స్ఛేంజ్‌లో రాష్ట్రంపై నిషేధం విధించే పరిస్థితి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేసిన కంపెనీల దగ్గర నుంచి, విద్యుత్ తీసుకుని, డబ్బులు చెల్లించక పోవటంతో, బకాయిలు పేరుకుపోవడంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు కంపల్సరీ అవ్వటంతో, ముందుగా ఎన్‌టీపీసీకి సంబంధించిన విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వటం మొదలుపెట్టింది. దీనికి నెలకు సుమారుగా రూ.550 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ఒక ప్రైవేటు ప్రైవేటు థర్మల్‌ విద్యుత్‌ కంపెనీ దీని పై ఎక్స్ఛేంజ్‌లో రాష్ట్రం పై ఫిర్యాదు చేసింది. దీంతో వారికి కూడా ఎల్‌సీ జారీ చేసారు.

jagan 15102019 3

అయితే ఇప్పుడు సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు ముందస్తు ఎల్‌సీ ఇవ్వాలంటే, ఇప్పుడు మరో 500 కోట్లు దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంత ఇవ్వాలి అంటే ఏమి చెయ్యాలో అని రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోతుంది. దీంతో చీఫ్ సెక్రటరీ వివిధ శాఖలతో సమీక్ష జరిపి, వివిధ శాఖల నుంచి విద్యుత్‌శాఖకు రావాల్సిన పెండింగ్ బిల్లుల పై చర్చించారు. రూ.6 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, జలవనరులశాఖ నుంచే రూ.2 వేల కోట్ల రావాల్సి ఉందని, పెండింగ్ చెల్లింపులు జరపాలని ఆర్ధికశాఖ అధికారులకు సీఎస్ ఆదేశించారు. అయితే అంత డబ్బులు ఇప్పటికిప్పుడు కుదరదు అని చెప్తున్నారు. మరో పక్క, కేంద్రం నిర్ణయం పై, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కి వెళ్ళింది.సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు ఎల్‌వోసీ ఇవ్వాలన్న ఆదేశాల పై హైకోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ వేసింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎల్‌ఓసీలు సాధ్యంకాదని, కేంద్రం ఉత్తర్వులు రద్దు చెయ్యాలని కోరింది. కేంద్ర ఆదేశాల పై, మూడు వారాలపాటు హైకోర్టు స్టే విధించి, వచ్చే నెల 5కి కేసు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read