జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అన్ని పనులు రివెర్స్ లోనే వెళ్తున్నాయి. చంద్రబాబు మీద కోపంతో, చంద్రబాబు ముద్రలు ఈ రాష్ట్రంలో ఏమి ఉండకూడదు అని జగన్ తాపత్రయ పడుతున్నారు. ముందుగా చంద్రబాబు కట్టిన ప్రజా వేదిక కూల్చేసారు. తరువాత అమరావతి ఆపేశారు. పోలవరం ఆపేశారు. అలాగే పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టె, అన్న క్యాంటీన్లు ఆపేసారు. అయితే నవ్యాంధ్రలు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ఆపెయ్యటం మాత్రం, అందరూ అవాక్కయ్యారు. నవయుగ కంపెనీ వచ్చిన తరువాత, పోలవరం పనులు పరుగులు పెట్టాయి. ట్రాన్స్ ట్రాయి కంపెనీ సరిగ్గా పని చెయ్యటం లేదని, చంద్రబాబు పట్టుబట్టి, నితిన్ గడ్కరీని ఒప్పించి, నవయుగని తీసుకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి, పనులు పరుగులు పెట్టాయి.
అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత పోలవరం పనులు ఆపేసారు. తరువాత నెల రోజుల పైన తరువాత, ఏకంగా నవయుగ కంపెని టెండర్ క్యాన్సిల్ చేసి, కొత్త టెండర్ కోసం జగన్ ప్రభుత్వం చూస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ ఇలా ఆపటం పై, కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా పార్లిమెంట్ లోనే, కేంద్ర మంత్రి, ఇదేమి తీరు అంటూ రాష్ట్రాన్ని తప్పుబట్టారు. దీంతో ఈ రోజు హైదరాబాద్ లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అత్యవసర సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా రమ్మన్నారు. ఎందుకు ముందుగానే నవయుగని పంపించి వేసారు, దీనికి కారణం ఏంటి అని చెప్పమంటే, రాష్ట్ర అధికారులు, ఇందులో అవినీతి జరిగింది అంటూ చెప్పారు. అయితే, ఆ కారణం పై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒప్పుకోలేదు.
నవయుగ కంపెనీ వచ్చిన తరువాత పనులు పరుగులు పెట్టాయని, వాళ్ళు చాలా బాగా పని చేసారని అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభిప్రాయ పడింది. ఇప్పుడు నవయుగని తప్పించి, కొత్త టెండర్ కు వెళ్తే, జెక్టు పూర్తి చేసే సమయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అభిప్రాయపడింది. దీని పై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని కోరింది. అంతే కాదు, ఇలాంటి విషయాల పై నిర్ణయాలు తీసుకునే ముందు, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే విషయం పై, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చే అవకాసం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత కక్షతో నిర్ణయాలు తీసుకుంటే, ఇలాగే ఉంటుంది అని, ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకుంటే, రాష్ట్రానికి మంచి జరుగుతుంది.