మొన్నటి వరకు పాలనకు కేంద్ర బింధువు ఆ భవనం.. ప్రజల కోసం నిర్మించిన భవనం.. తమకు ఏ కష్టం వచ్చినా, ఆ బాధ ముఖ్యమంత్రికి చెప్పుకుని, ఆయన సహాయం చేస్తారు అనే భరోసాతో, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చే వారు. చంద్రబాబు కూడా అంతే ఉదారంగా సియం రిలీఫ్ ఫండ్ నుంచి సహయం చేసారు. ఇక పాలన పరంగా సమీక్షలు, కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్, పెట్టుబడుల కోసం వచ్చే ఇన్వెస్టర్స్, ఇలా రాష్ట్ర గతిని మార్చే నిర్ణయాలు అన్నీ ఇక్కడే జరిగేవి. వివిధ సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే లబ్దిదారులు కూడా ఇక్కడకు వచ్చి చంద్రబాబుకు కృతజ్ఞత చెప్పే వారు. ఇలాంటి కట్టడం, తన కళ్ళ ముందే కూల్చేస్తుంటే, ఎంతటి వారికైనా మనసు చివుక్కు మనకు మానదు. ఎందుకంటే వాళ్ళకు కూల్చటం తెలియదు, ఎంతో కష్టపడి కట్టడమే తెలుసు. దీనికి చంద్రబాబు కూడా అతీతులు కారు. నిన్న అర్ధరాత్రి సమయంలో, గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు, ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

ఆయన నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదిక కూలిపోతుంటే, అది కార్ లో నుంచి చూసుకుంటూ, ఇంటికి వెళ్లారు. ఎన్నో జ్ఞాపకాలు ఉన్న ఆ భవనం కూలిపోతుంటే, ఆ సమయంలో చంద్రబాబు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని సమాచారం. మరో పక్క చంద్రబాబు వస్తున్నారు అనే సమాచారంతో, ఏమన్నా ధర్నాలు చేస్తారేమో, తెలుగుదేశం శ్రేణులు గొడవలు చేస్తాయేమో అని ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను పెట్టింది. చంద్రబాబు మాత్రం, ఎటువంటి నిరసన తెలపవద్దు అని, ప్రజలే అన్నీ చూస్తున్నారని చెప్పినట్టు సమాచారం. దీంతో, తెలుగుదేశం శ్రేణులను కూడా కట్ట మీదకు రానియ్యకుండా, చంద్రబాబు వాహనం ఒక్కటే పంపించారు. అయినా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు ఆదేశాల ప్రకారం, ఎటువంటి ఆందోళన చెయ్యకుండా వెను తిరిగారు. ఇక మరో పక్క, నిన్న అర్ధరాత్రి మరో హైడ్రామా నడిచింది. ప్రజా వేదిక కూల్చివెత పై అత్యవసర పిటీషన్ ధాఖలు అయ్యింది. అర్ధరాత్రి విచారణ ప్రారంభం అయ్యింది. అయితే అప్పటికే 60 శాతం వరకు కూల్చి వేయటంతో, హైకోర్ట్ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా, కేసు రెండు వారాలు వాయిదా వేసింది. మొత్తానికి, ఇన్ని హైడ్రామాల మధ్య, ప్రజా వేదిక చరిత్రలో కలిసి పోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read