ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాని లేని కొత్త సంస్కృతీ జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చారు. తమిళనాడు తరహా కక్ష పురిత రాజకీయాలు మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. అమరావతి మీద తనకు ఎంత కక్ష ఉందో, ప్రమాణ స్వీకారం రోజే చూపించారు. 40 వేల మంది కార్మికులతో నిత్యం బిజీగా ఉండే అమరావతి, నేడు ఒక్క మనిషి కూడా లేకుండా, ఎక్కడి కట్టడాలు అక్కడ ఆగిపోయాయి. అమరావతి పై ఇప్పటి వరకు జగన్ సమీక్ష చెయ్యలేదు, క్లారిటీ ఇవ్వలేదు. అమరావతి అంటే, అదేదో చంద్రబాబు ఆస్తి అనుకుంటూ, 33 వేల ఎకారాలు ఇచ్చిన రైతులకు క్షోభ మిగిల్చారు. అలాగే ప్రజావేదిక. ఒక ప్రతిపక్ష నేతకు, ప్రభుత్వం నివాసం కల్పించాలి. అందులో భాగంగా, ప్రజా వేదికను తన కార్యకలాపాలకు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అయితే దాని పై సమాధానం ఇవ్వకుండా, సామాను బయట పడేసి, ఏకంగా చంద్రబాబు ఇంటి పక్కన ఉన్న ప్రజా వేదిక వద్దే కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ పేరుతొ, వచ్చి జగన్ కూర్చున్నారు.
ఇది ఏ తరహా రాజకీయమో ప్రజలే నిర్ణయిస్తారు. అంతటితో ఆగలేదు, ఇప్పుడు ఏకంగా అమరావతిలో కూల్చే మొదటి బిల్డింగ్ ఈ ప్రజా వేదిక అంటూ జగన్ ప్రకటించారు. నిబంధనలకు అనుకూలంగా ఇది కట్టలేదని, అందుకే దీన్ని బుధవారం కూల్చేయాలి అని జగన్ ఆదేశించారు. చంద్రబాబు ఊరిలో లేని సమయంలో, ఆయన వాడుకుంటున్న ఆఫీస్ ని, కనీసం ఆయన వచ్చే దాక అయినా ఉండకుండా, నిబంధనలు పేరు చెప్పి, కూల్చేస్తున్నారు. ఇన్ని నిబంధనలు చెప్పే జగన్ గారు, ఆ పక్కనే ఉన్న గోకరాజు గంగ రాజు గెస్ట్ హౌస్, ఆ పక్కనే ఉన్న మంతెన సత్యన్నారాయణ ఆశ్రమం కూల్చే దమ్ము ఉందా ? గోకరాజు జోలికి వెళ్తే అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు తలుచుకుంటే 24 గంటల్లో సీన్ రివర్స్ అవుతుంది. అందుకే వాళ్ళ జోలికి వెళ్లరు. అధికారం లేదు కాబట్టి చంద్రబాబు జోలికి వెళ్తారు. ఇదే చంద్రబాబు, జగన్ లాగా అలోచించి ఉంటే ? అధికారం బాధ్యతను పెంచాలి, అహంకారం కాదు. కాలమే అన్నిటికీ సమాధనం చెప్తుంది.