ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ని కాంగ్రెస్ పార్టీలో కలిపేయటాన్ని సమర్థించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ మోదీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కాగ్రెస్‌తో తమ పార్టీ కలసి పోరాడటం తప్పెలా అవుతుందో వివరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల పొట్టకొట్టే నరేంద్ర మోదీని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఇది కేంద్రంలోని బీజేపీతో ఆయన లాలూచీకి నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్భ్రావృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్ట పెరగటాన్ని చూసి ఓర్వలేకే నిందలు మోపుతున్నారని ఖండించారు.

pr 05112018 2

పంచాయతీ ఎన్నికల్లో గెలవకుండానే ఎలా మంత్రి అయ్యావని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం పవన్‌కు ఉందా? అని నిలదీశారు. లోక్‌సభకు పోటీ చేయకపోయినా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తుచేశారు. అవినీతికి పాల్పడిన సొంత పార్టీ వారిని సైతం జైల్లో పెట్టించారన్నారు. అదే లోక్‌సభకు ఎన్నికైన ప్రధాని మోదీ బ్యాంకులను లూటీ చేసిన నీరవ్ మోదీని దేశం దాటించారని ఆరోపించారు. మోదీతో గొడవ పెట్టుకునే నైతిక బలం చంద్రబాబుకు లేదని విమర్శించటం మోదీ మెప్పు కోసమేనని అన్నారు. రాఫెల్ వ్యవహారంలో మోదీలో ఏ నైతికత కనిపించిందో తేల్చాలన్నారు. అవినీతి ఆస్థానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించి సంస్థ ప్రతిష్టను మంట గలిపింది గుర్తుకు రాదా అని నిలదీశారు.

pr 05112018 3

రాజకీయ భిక్ష పెట్టిన అద్వానీ కంటతడి పెట్టించిన నిరంకుశ మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రాష్ట్రానికి 75వేల కోట్లు రావాలని తీర్మానించిన పవన్ ఆ మొత్తం ఇవ్వాలని మోదీని ఎందుకు నిలదీయరన్నారు. అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడే నైతిక స్థైర్యం లేనందునే చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి నైతిక బలం ఉన్నందునే కేంద్రంపై అవిశ్వాసం పెట్టిందని మంత్రి జవహర్ గుర్తుచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read