చంద్రబాబుని గెలిపించింది నేనే... చంద్రబాబుకి అనుభవం ఉందని, నేనే మద్దతు ఇచ్చి గెలిపించా... నేను కాపుని, కాని నాకు అన్ని కులాలు ముఖ్యం... చంద్రబాబుకి ఎలా పాలించాలో తెలియదు.. ఏపిలో మార్పు రావాలి, నేను మార్చేస్తా... ఏపి యువత అంతా నా వెంటే ఉన్నారు... తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే టైం నాకు లేదు, ముందస్తు రాకుండా ఉంటే పోటీ చేసే వాడిని, తెలంగాణాలో నా టార్గెట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు... చంద్రబాబు నన్ను చూస్తే భయపడి పోతున్నారు.. చంద్రబాబు నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు.. పోయిన ఎన్నికల్లో టిడిపిని నేనే గెలిపించా, ఈ సారి మాత్రం గెలిపించను... ఈ మాటలు అన్నది ఎవరో చెప్పుకోండి ? పవన్ కళ్యాణ్ ఏ కదా, ఇంత సిల్లీ ప్రశ్న ఏంటి అనుకుంటే, మీరు పొరపాటు పడినట్టే..
అచ్చం జనసేన లాగా, అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఆలోచించే ఇంకో కొత్త పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలు ఇవి. మత ప్రచారకులు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కె.ఎ.పాల్ చెప్పిన మాటలు ఇవి. 2008లో పార్టీ పెట్టాను, అనుభవం కోసం చూసాను, ఇక ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి, నా సమయం మొత్తం ప్రజలకు సేవ చెయ్యటానికి వస్తున్నా, ఏపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటూ, కేఏ పాల్ రంగంలోకి దిగారు. నిన్న టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇచ్చారు. చంద్రబాబుని గెలిపించింది నేనే అంటూ మొదలు పెట్టి, నేను సియం అవుతున్నా, స్వర్ణాంధ్ర చేస్తాను అంటూ, చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా బీసీ, దళిత నాయకులు తనతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారన్నారు. అలాంటి వారి కోసమే ఇక్కడ ఉండి పనిచేస్తానని కె.ఎ.పాల్ స్పష్టం చేవారు.
తెలంగాణలో రెబల్స్‌గా నామినేషన్స్ వేసిన బడుగు, బలహీన వర్గాల వారి తరపున ప్రచారం చేసే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎలాంటి మార్పు రాలేదని, మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే తాను మళ్లీ వచ్చానని, ఈసారి ఆ మార్పే లక్ష్యంగా 6నెలల పాటు ఇక్కడే ఉండి పనిచేస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై డిసెంబర్ 8,9 తేదీల్లో భీమవరంలో భారీ ఎత్తు మహాసభలు నిర్వహిస్తామన్నారు. అయితే కేఏ పాల్ చెప్పే ప్రతి మాట వింటుంటే, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే గుర్తుకువస్తున్నాయి అని, అటు జనసేన అభిమానులు, ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి దగ్గరగా కేఏ పాల్ ఉన్నారు కాబట్టి, ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి, చంద్రబాబుని ఓడిస్తారేమో చూడాలి.