ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం మండలం నర్సాయపాలెం గ్రామ శివార్లలో గత రెండురోజుల నుంచి ఆకాశంలో చక్కర్లు కొడుతున్నది విమానమా లేక చాపరా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం నర్సాయపాలెం గ్రామంలోని కొండప్రాంతంలో , గంగాపాలెం, యర్రగొండపాలెం పట్టణం, పుల్లలచెరువు మండలంలో విమానం లాంటిది చాలా కిందిస్థాయిలో పలుసార్లు చక్కర్లు కొట్టడం అనుమానాలను రేకెత్తిస్తోంది. గత రెండురోజుల నుంచి నర్సాయపాలెం ఎస్సీపాలెం సమీపంలోని కొండప్రాంతంలో సుమారు 300 అడుగుల ఎత్తులో గుండ్రంగా ఒక పెద్దపాటి ప్లేటులాగా ఆకాశంలో తిరగడం గ్రామీణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పశ్చిమప్రాంతంలోని మారుమూల గ్రామంలో మొదటిగా విమానం కిందిస్థాయిలో తిరిగిందని, ఆ తరువాత చాపర్ లాంటి వస్తువు సుమారు గంటపాటు కొండలపై చక్కర్లు కొట్టిందని గ్రామప్రజలు అంటున్నారు.

prakasam 26042019

నర్సాయపాలెం, గంగాపాలెం గ్రామాల్లోని కొండ ప్రాంతాల్లో కాపర్ ఖనిజం ఉందని కొందరు, గ్రానైట్ కొండలు ఉన్నాయని మరికొందరు చెబుతుండగా ఈప్రాంతంలో విలువైన వజ్ర వైడుర్యాలు కలిగిన గుప్తనిధులు ఉన్నాయని, అందుకే విమానం ద్వారా అధునాతన మిషన్ల ద్వారా ఆరా తీస్తున్నారని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భూమినుంచి సుమారు 300 అడుగుల ఎత్తులో ఎగిరిన వస్తువులు ఏమిటి, అసలు ఈప్రాంతంలో ఏమి జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల కిందట ఇదేవిధంగా యర్రగొండపాలెంలోని కొప్పుకొండమీదుగా సుమారు 100 అడుగుల ఎత్తులో నిచ్చెనలాంటి తాడును వదిలి పలుసార్లు విమానం చక్కర్లు కొట్టింది.

మరల నర్సాయపాలెంలో గత రెండురోజుల నుంచి ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో చాపర్ లాంటి వస్తువులు ఆకాశంలో తిరగాడుతూ కనిపించడంతో గ్రామీణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై కొందరిని ఆరా తీయగా డ్రోన్ కెమెరా లాంటి వస్తువు కొండలపై గత రెండురోజుల నుంచి తిరగాడుతుందని, దానికి సంబంధించిన వ్యక్తులు సుమారు 100మీటర్ల దూరంలో రిమోట్ కంట్రోల్ ద్వారా దానిని పరిశీలిస్తూ ఉంటారని, ఈవిషయమై పోలీసులు ఆరా తీయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులను వివరాలపై వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని శుక్రవారం దాని విషయపై పరిశీలన చేసి చెపుతామని సమాధానం దాటవేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read