ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కొత్త మంత్రివర్గం పై, అటు సామాజికవర్గంగా, అలాగే ఇటు సొంత పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కొన్ని సామాజికవర్గాలకు అసలు మంత్రి పదవి లేకండా చేయటం, కమ్మ , వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ సామజికవర్గాలకు, అసలు చోటు లేక పోవటం, అలాగే ప్రకాశం జిల్లా నుంచి ఒక్కరికీ కూడా మంత్రి పదవి ఇవ్వకపోవటం పై, తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రకాశం జిల్లాలో మార్పులు చేసారు. మళ్ళీ ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేశ్‍కు అవకాసం ఇచ్చారు. అయితే ఇప్పటికే కొత్త మంత్రివర్గంలో ప్రకటించిన తిప్పేస్వామికి షాక్ ఇస్తూ, ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. చివరి నిమిషంలో చేసిన మార్పులతో ఆదిమూలపు సురేశ్‍కు చోటు దక్కింది. తిప్పేస్వామికి నిరాశ ఎదురైంది.
Advertisements