పింఛను మూడు వేలు చేస్తామని మూడు విడతల్లో పెంచిన 250 పింఛను అందినంత సేపు సంతోషం నిలవలేదు. దొంగవో, మంచివో నోట్లు పోల్చలేని వృద్ధులు, నిర‌క్ష‌రాస్యులు, దివ్యాంగుల‌ను మోస‌గించిన ఉదంతం క‌ల‌క‌లం రేపుతోంది. జ‌న‌వ‌రి 1వ తేదీ ఉద‌యాన్నే పింఛ‌న్లు ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెం మండ‌లం నరసాయపాలెంలో పంపిణీ ఆరంభించారు. 2750 పింఛ‌నులో మూడు 500 నోట్లు దొంగ నోట్లు కావ‌డంతో ల‌బ్దిదారులు ల‌బోదిబోమంటున్నారు. పింఛ‌ను అందిన ముస‌లోళ్లు, విక‌లాంగులు ఆ నోట్ల‌ను షాపుల‌లో కొనుగోలు చేయ‌డానికి, బాకీలు తీర్చ‌డానికి ఉప‌యోగిస్తే దొంగ‌నోట్లు అంటూ వారు తిర‌స్క‌రించారు. దీంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. దాదాపు 24 మందికి ఈ దొంగ‌నోట్లు ఇచ్చార‌ని తేలింది. ఒక్క ఈ ఊర్లోనే ఇలా పింఛ‌నులో దొంగ‌నోట్లు ఇచ్చారా? ఇంకెక్క‌డికైనా ఇలాంటి పునరావృతం అయ్యాయా అనేది తేలాల్సి ఉంది. కొత్త సంవ‌త్స‌రం పింఛ‌ను అందింద‌న్న సంతోషం, అవి దొంగ‌నోట్లు అని  తేల‌డంతో పెన్ష‌న‌ర్లు  తీవ్ర ఆందోళ‌న చెందారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read