మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) కార్యక్రమానికి, నాగపూర్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పెద్ద దుమరామే లేపింది. అయినా ప్రణబ్ ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఆయన అక్కడకు వెళ్లారు. అయితే, ఇప్పుడు బీజేపీ చేసిన ఫోటో మార్ఫింగ్ చూసి, ప్రణబ్ బెంబేలెత్తిపోయారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్‌ ఫొటోలను బీజేపీ ఐటి సెల్ మార్ఫ్‌ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. ఇలాంటిది జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ భాజపాపై విమర్శలు చేశారు.

pranab 08062018 2

ఆరెస్సెస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించడంతో ఆయన కుమార్తె, కాంగ్రెస్‌ నాయకురాలైన శర్మిష్ట కూడా భాజపాలో చేరవచ్చంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను ఖండించిన శర్మిష్ట భాజపాపై విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌ ఆరెస్సెస్‌ సభలో ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగాన్ని అందరూ మర్చిపోతారని, ఫొటోలు, వీడియోలు మాత్రం అలాగే ఉంటాయన్నారు. ఆ ఫొటోలకు బూటకపు ప్రకటనలు జోడించి భాజపా ప్రచారం చేసే అవకాశముందని పేర్కొన్నారు. తాజాగా మార్ఫ్‌ చేసిన ప్రణబ్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో కన్పించడంతో మరోసారి ఆమె భాజపాపై ధ్వజమెత్తారు.

pranab 08062018 3

మార్ఫ్‌ చేసిన ప్రణబ్‌ ఫొటోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా.. దాన్ని ట్వీట్ చేస్తూ.. ‘చూశారా.. దీని గురించే నేను భయపడింది. మా నాన్నకు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ప్రణబ్‌ మాట్లాడి కొద్ది గంటలైనా కాకముందే.. భాజపా/ఆరెస్సెస్‌ ట్రిక్స్‌ విభాగం చురుగ్గా పనిచేసింది’ అని శర్మిష్ట పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలో ఆరెస్సెస్‌ నేతలు ప్రతిజ్ఞ చేయగా ప్రణబ్‌ మాత్రం మామూలుగా లేచి నిల్చున్నారు. అయితే ఈ ఫొటోలను కొందరు మార్ఫ్‌ చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఆరెస్సెస్‌ నేతల మాదిరిగా తన కుడిచేతిని ఛాతి వరకు చాచి ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read