నెల్లూరు జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ప్రతి రోజు ఏదో ఒక వార్తతో వార్తల్లోకి వచ్చే కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఈ సారి కూడా, పోలీసుల పై దౌర్జన్యం చేస్తూ, కెమెరాకు చిక్కారు. వారం రోజుల క్రిందట, ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ, నెల్లూరు కలెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి, ఈ రోజు ఏఎస్ఐ పై తమ ప్రతాపం చూపించారు. అధికారంలో ఉన్నామోనో, తమను ఏమి చెయ్యలేరు అని ఏమో కాని, పోలీసుల పై దౌర్జన్యం చేసారు ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా బుచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో, వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, దౌర్జన్యం చేసారు. ఏఎస్ఐ ఫోను లాగేసుకుని, విధులకు ఆటంకం కలిగించారు. అనుచరులు ఫోను లాక్కున్నారని, ఎమ్మెల్యేకు చెప్పగా, ఫోను ఇవ్వను, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ సేవలతో మాకు పనిలేదు అంటూ, ప్రసన్నకుమార్ రెడ్డి, ఏఎస్ఐ పై వ్యాఖ్యలు చెయ్యటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన పై, ఏఎస్ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.
మొన్న జిల్లా ఎస్పీ పై, కలెక్టర్ పై, ఈ రోజు ఏఎస్ఐ పై ఎమ్మెల్యే చేస్తున్న దౌర్జన్యం పై, పోలీసు వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం పై, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని పై ఆలోచనలు చేస్తున్నారు. నెల్లూరులో జరిగిన దాని పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. తెదేపా ఏపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు స్పందిస్తూ, "ఏపీలో రావణ రాక్షస రాజ్యం కొనసాగుతోంది...హిట్లర్ పాసిజం పరాకాష్టకు చేరింది. పాలకులు మారడంతో ధర్మం అధర్మమైంది, నీతి అవినీతి రూపం సంతరించుకుంది.. అమరావతిలోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద దీక్ష చేపట్టిన దళిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ను పోలీసులు అడ్డుకోవడం సహించరాని నేరం. 150 రోజులుగా ప్రజా రాజధానిని కాపాడుకోవడానికి రైతులు, కూలీలు, మహిళలు, అన్ని వర్గాలు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్రంలోని అన్ని పార్టీలు, వర్గాలూ సంఘీభావం తెలుపుతుంటే అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకూ సబబు. శాంతియుతంగా ఉద్యమ సాగిస్తున్న రైతులను అరెస్ట్ చేసి మూడు రాజధానులంటూ రాజధానిని విశాఖకు తరలించే యత్నం చేయడం దుర్మార్గం. భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవం బాబా సాహెబ్ అంబేద్కర్ కు రైతుల ఆవేదనను విన్నవించుకోడానికి వెళ్తున్న తెదేపా మాజీ శాసనసభ్యులు శ్రవణ కుమార్ ను పోలీసులు అక్రమగా నిర్బంధించడం హేయం. "
"అవినీతికి, అన్యాయాలకు పాల్పడ్డ వైకాపా నేతలకు రాచమర్యాదలు చేయడమా? న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ బడుగులకు అండగా నిలుస్తున్న తెదేపా నేతలపై పులివెందుల చట్టాన్ని అమలు పరిస్తే తెదేపా చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర మూలధనం లాంటి నేలతల్లిని వేలమేస్తు స్వయంగా సీఎం జగన్ భారీ దోపిడీకి తెరతీస్తుంటే `గేదె చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్లు తయారైంది వైకాపా నేతల దోపిడీ,అరాచకాలు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని అతలాకుతలం అవుతుంటే జగన్ మాత్రం ప్రతి అంశంలోనూ దోపిడీకి తెరతీశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు మద్దతుగా ఆర్ ఆర్ వెంకటాపురాన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తితో పాటు మరి కొందరు నేతలను ఎలా అరెస్టు చేస్తారు. గుడివాడలో భూ కబ్జాలు చేస్తూ గుండాయిజంతో రిజిస్ట్రేషన్ భూముల్లో పాగా వేస్తుంటే పోలీసులు గడ్డం గ్యాంగ్ కి కొమ్ముకాస్తారా? నెల్లూరు జిల్లాలో బుచ్చిలో ఏఎస్ఐటపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెగడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తే ఇక సామాన్య ప్రజలకు దిక్కేది? తక్షణం పోలీసు బాస్ గుడివాడలో భూ కబ్జాలు, నెల్లూరులో ఏఎస్ఐ పై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రె డ్డి అనుచరులు దౌర్జన్యంపై విచారణ జరిపించి నిందితులకు శిక్ష వేయాలి." అని డిమాండ్ చేసారు.