ప్రశాంత్ కిషోర్... ఈ పేరు తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరు. జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేస్తూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి, ఫేక్ చేసి, ఇష్టం వచ్చినట్టు అస్తవ్యస్తం చేసి, కుల గొడవలు, ప్రాంతీయ గొడవలు, ఇలా రకరకాలుగా చేసి, జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించిన వ్యక్తి. ఐప్యాక్ సంస్థతో కలిసి, ప్రశాంత్ కిషోర్ చేసిన రచ్చ ఏపిలో అంతా ఇంతా కాదు. ఇందు కోసం జగన్ మోహన్ రెడ్డి, పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చారు. వందల కోట్లు అని ప్రచారం ఉంది కానీ, నిజం అయితే తెలియదు. ఇలా వందల కోట్లు ప్రశాంత్ కిషోర్ కి ఇచ్చిన జగన్, ప్రశాంత్ కిషోర్ కి సన్నిహితుడు అయిపోయారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కాలంలో జాతీయ రాజకీయాల పై దృష్టి పెట్టారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు బీహార్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పని చేసారు. అలాగే ప్రధాని మోడి కోసం కూడా గతంలో పని చేసారు. ఇప్పుడు తాను గెలిపించిన ఇన్ని రాష్ట్రాలు ఉండటంతో, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలు పై ఫోకస్ పెట్టారు. ఎక్కడ చేడిందో ఏమిటో కానీ, మోడిని దించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీ వద్దకు వెళ్లి ప్రతిపాదన పెట్టారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మీటింగ్ పెట్టుకున్నారు.
అయితే ఈ ప్రతిపాదన మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే ప్రత్యామ్న్యాయం వైపు ప్రశాంత్ కిషోర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్, నిన్న ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత రాజకీయాలు గురించి, అడిగిన యాంకర్, మీరు బీజేపీ అజేంట్ అని అందరూ అంటున్నారు, దీని పై మీ సమాధానం ఏమిటి అని అడగగా, అలా ఎందుకు అంటున్నారు ? నేను గెలిపించిన జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ పై ఎలాంటి పోరాటం చేయటం లేదు కాబట్టి, నేను బీజేపీ అజేంట్ అనుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ పై ఎలాంటి పోరాటం చేయటం లేదు అని చెప్పటమే కాదు, జగన్ వల్ల తనని బీజేపీ అజెంటు అనుకుంటున్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రశాంత్ కిషోర్ చెప్పకపోయినా, జగన్ మొహన్ రెడ్డి, ఎలాంటి పోరాటాలు చేయటం లేదు అని తెలుసు అనుకోండి.