పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) విజయానికి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కృషి చేయబోతున్నారు. టీఎంసీతో గురువారం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం ప్రశాంత్ కిశోర్‌తో దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తూ ఒప్పందంపై సంతకాలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రశాంత్ కిశోర్ బృందం వచ్చే నెల నుంచి కార్యరంగంలోకి దూకుతుందని తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు వ్యూహాలు రచించారు. అదేవిధంగా 2015లో బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు వ్యూహకర్తగా విజయం సాధించారు. 2017లో ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేశారు. కానీ కాంగ్రెస్‌కు విజయం దక్కలేదు.

pk 06062019

తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపాకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించారు. వైకాపా ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ బృందం సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ గెలుపుతో తమను చాలా పార్టీలు సంప్రదిస్తున్నాయని తెలిపారు. 2021లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీకి పనికిచేసినట్లుగానే.. బెంగాల్‌లోనూ మమత బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు ఆయన సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి సేవలందిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించవచ్చని మమత భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో సమావేశమై టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేసే అంశంపై మంతనాలు జరిపారు.

 

pk 06062019

లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో టీఎంసీకి బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. 42 లోక్‌స్థానాలకు గాను టీఎంసీ 22 సీట్లు గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో 2 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 సీట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్..ఈసారి 22 స్థానాలక పడిపోవడంతో మమత బెనర్జీలో ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని గ్రహించిన బెంగాల్ సీఎం..2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read