ఏపీలో విచిత్ర పాలన నడుస్తోంది. జంబలకిడి పంబ సినిమాకి ఏ మాత్రం తగ్గిపోని విచిత్ర వ్యవహారాలు, వింతలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులుంటారు. అందరి తరఫున సలహాదారుడు సజ్జల మాత్రమే మాట్లాడతారు. రివర్స్ టెండరింగ్ లా రివర్స్ పాలనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తూన్న ఏపీలో మరో జంబలకిడి పంబ నిర్ణయం కలకలం రేపుతోంది. రాష్ట్రమంతా అధ్వాన రహదారులతో ప్రయాణికులకు నిత్యమూ నరకం కనపడుతోంది. అడుగుకో గుంతల్లో రోడ్లను వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని లోకేష్ ఇటీవల వ్యంగ్యంగా రాష్ట్రంలో రోడ్ల సమస్యని ఎత్తిచూపారు. అధ్వాన రహదారుల సమస్య వైసీపీకి విపరీతమైన డ్యామేజ్ చేయడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ సంస్థ తేల్చేసింది. ఈ నేపథ్యంలో తాము చెప్పినట్టు సర్కారు చేయాలని పీకే టీం ప్రభుత్వ పెద్దలకు చెప్పేసింది. ప్రయాణికుల ఇబ్బందులు, అత్యవసరంగా వేయాల్సిన రోడ్లు గురించి ఇంజనీర్లు ఇచ్చే నివేదికలు కంటే, ఐ ప్యాక్ ఏ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతుందో అక్కడ రోడ్లు వేసే ప్రణాళికని ఐ ప్యాక్ రూపొందించింది. ప్రశాంత్ కిశోర్ టీము దెబ్బకి ఇంజనీరు బకరాలైపపోయారు. 5 నెలల క్రితం ఏపీ ప్రభుత్వ ఇంజనీర్లు పంపిన ఎస్టిమేషన్స్ అన్నీ బుట్టదాఖలు చేశారు. ప్రశాంత్ కిశోర్ బృందం ఐ ప్యాక్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై చేసిన అధ్యయనం నివేదికలో, అత్యవసరంగా వేయాల్సిన రోడ్లను సూచించింది. ఐ ప్యాక్ వేయమన్న రోడ్లనే వేయాలని ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చేసింది సర్కారు. తాము చెప్పిన రోడ్లు యుద్ధప్రాతిపదికన వేయాలని, లే పోతే ప్రజావ్యతిరేకత మరింతగా పెరిగిపోతుందని ఐ ప్యాక్ టీమ్ వైసీపీ పెద్దలని హెచ్చరించడంతో, రోడ్లు ఎంపిక చేసే బాధ్యత కూడా వారికే అప్పగించేశారు. ఎన్నికలకు వెళ్లేలోగానే రోడ్లు బాగు చేయకపోతే ఓటమి ఖాయమని తేల్చి చెప్పిన ఐప్యాక్ ఒక్కో నియోజకవర్గానికి ముఖ్యమైన 5 రోడ్లను సెలెక్ట్ చేసి వేయాలని హుకుం జారీ చేసింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులు 6,182 కిలోమీటర్ల రహదారులను పునరుద్ధరించాలని, దీని కోసం 1,700 కోట్ల వ్యయమవుతుందని అంచనాలు సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ఈ రోడ్లు, అంచనాలు మరిచిపోండని అధికారులకు స్పష్టం చేసింది. ఐ ప్యాక్ వేయమన్న రోడ్లే వేయాలని చెప్పేయడంతో అధికారులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు.
ప్రశాంత్ కిషోర్ ఏపిలో ఇంత పవర్ఫుల్ అయిపోయాడా ? ఇక మంత్రులు ఎందుకు దండగ ?
Advertisements