జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన మంత్రివర్గ విస్తరణలో కొన్ని అనుహ్య నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని బలమైన సామజికవర్గాలకు క్యాబినెట్ లో అసలు చోటు కూడా లేకపోవటం, కొన్ని బలమైన జిల్లాల నుంచి మంత్రులు ఎవరూ లేకపోవటం ఆశ్చర్య పరిచే అంశం. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల నుంచి ఒక్కరికి కూడా క్యాబినెట్ పదవి లేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒకే ఒక మంత్రి పదవి ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచే అంశం. ఇక 4 కీలక సామాజిక వర్గాలైన వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ వర్గాలకు ఒక్క పదవి కూడా లేకపోవటం కీలక అంశం. మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కమ్మ సామాజికవర్గం ప్రాతినిధ్యం లేకుండా మొదటి సారి క్యాబినెట్ ఏర్పడింది. మొన్నటి వరకు కొడాలి నాని కమ్మ సామాజికవర్గం నుంచి ఉండేవారు. ఇప్పుడు కొడాలి నానిని కూడా తీసి పడేయటంతో, కమ్మ సామాజికవర్గం నుంచి ఎవరూ లేకుండా పోయారు. మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి కమ్మ సామాజికవర్గం పై ద్వేషం ఉంది. కరోనా వైరస్ ని కూడా కమ్మ వైరస్ అనటం, రాజ్యంగబద్ధ పదవుల్లో ఉన్న ఎలక్షన్ కమీషనర్, సుప్రీం కోర్టు జడ్జిలను కూడా కులం పేరుతో తిట్టటం, ఇలా ఆ సామజిక వర్గం పై మొదటి నుంచి ద్వేషంతో ఉన్న జగన్, ఇప్పుడు ఆ ద్వేషాన్ని మంత్రివర్గ విస్తరణలో కూడా చూపించారు. ఇక మరో సామజికవర్గం అయిన ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి నిన్నటి వరకు, వెల్లంపల్లి ఉండే వారు.
ఇప్పుడు వెల్లంపల్లిని తీసి వేయటంతో, ఆ సామజికవర్గానికి కూడా పదవి లేదు. క్షత్రియ రాజుల సామాజికవర్గం నుంచి కూడా శ్రీరంగనాథరాజున తీసేసినా, ఎవరినీ తీసుకోలేదు. ఇక బ్రాహ్మణ సామాజికి వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదు. పోయిన ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం 40 శాతం వరకు జగన్ కు ఓటు వేసింది. అలాగే 90% వరకు వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలు జగన్ కు ఓటు వేసాయి. గత మూడేళ్ళు కాలంగా, కమ్మ వాళ్ళని వెంటాడి వేటాడంతో, కమ్మ సామాజికవర్గం జగన్ కు దూరం అయ్యింది. ఇక రోశయ్యని అవమానించటం దగ్గర నుంచి సుబ్బారావు గుప్తా వరకు చేసిన పనులకు వైశ్య సామాజికవర్గం దూరం అయ్యింది. దేవాలయాల పై దా-డు-లు, మాట మార్పిడులతో బ్రాహ్మణ వర్గం దూరం అయ్యింది. రఘురామరాజుని వెంటాడి వేటాడటంతో, క్షత్రియ సామాజికవర్గం కూడా దూరం అయ్యింది. ఈ నాలుగు సామాజిక వర్గాలు ఇక మీకు ఓటు వేయవని, ఇప్పటికే బీసీలు టిడిపి వైపు చూస్తున్నారని, వారిని మరింత అటు మళ్ళకుండా, వీరికి పీకి వారికి పదవులు ఇవ్వలేని ప్రశాంత్ కిషోర్ చెప్పటంతో, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.