ప్రత్యేక హోదా అనేది ఇప్పటికే ఒక పెద్ద రాజకీయ అంశం. గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి మొదటి అస్త్రం ఇదే. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పై జగన్ మోహన్ రెడ్డి పలికిన ప్రగల్భాలు అందరం చూసాం. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యువ భేరీ సభలు పెట్టి, యువతను ప్రత్యేక హోదా పై రెచ్చ గొట్టిన విధానం, ఇవన్నీ చూసాం. ప్రజలు కూడా ఇదే నమ్మి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇక పొతే రాజ్యసభలో, 6 గురు వైసీపీ సభ్యులు ఉన్నారు. అక్కడ గట్టిగా ఉంటే, ఏ బిల్లు కూడా కేంద్రానికి పాస్ కాదు. అయినా ఎక్కడా షరతులు పెట్టకుండా, ప్రత్యేక హోదా అడగకుండా, వైసీపీ ఎంపీలు భేషరతుగా మద్దతు ఇస్తున్నారు. హోదా ఏమైంది అని అడిగితే, వాళ్ళు బలంగా ఉన్నారు ప్లీజ్ సార్ ప్లీజ్ అని అనటం తప్ప మనం ఏమి చేయలేం అని జగన్ మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఇలా ప్రత్యేక హోదాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీరు గార్చేసింది. జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతి సందర్భంలో, అధికారిక ప్రకటన అయితే రాదు కానీ, సొంత మీడియాలో మాత్రం ప్రత్యేక హోదా అడిగినట్టు వార్తలు వస్తాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. రాజకీయం ఆడుతున్నారని అనుకోవచ్చు, ఇప్పుడు మరోసారి ఈ రోజు సాక్షి తప్ప, అన్ని పత్రికల్లో ప్రత్యేక హోదా గురించి వార్తలు వచ్చాయి.

cmo 04112021 2

తిరుపతిలో, ఈ నెల 14న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దక్షినాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గుంటారు. నిజానికి ఈ సమావేశం, దక్షినాది రాష్ట్రాల మధ్య సమన్వయం, రాష్ట్రాల మధ్య సమస్యలు చర్చిస్తారు. అంటే పోలవరం ప్రాజెక్ట్, విద్యుత్ బకాయలు, నీటి పంపకాలు, ఇలా అనేక అంతరాష్ట్ర సమస్యలు వస్తాయి. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అమిత్ షా సమక్షంలో ప్రత్యేక హోదా అడుగుతారు అంటూ, సియంఓ నుంచి లీక్ వచ్చింది. అన్ని పేపర్లు ఈ వార్త ప్రముఖంగా రాసాయి. అయితే జగన్ సొంత పత్రిక సాక్షి మాత్రం, అసలు ప్రత్యేక హోదా అనే వ్యాఖ్య ఎక్కడా రాయలేదు. ఆరు ముఖ్యమైన అంశాలు అంటూ, కొన్ని అంశాలు రాసారు. ఇవి మత్రమే చర్చిస్తారని ఉంది. ప్రత్యేక హోదా లాంటి ముఖ్యమైన అంశం ఎందుకు సాక్షిలో రాయలేదో అర్ధం కావటం లేదు. ప్రజలను మభ్య పెట్టటానికి మీడియాకు లీక్ ఇచ్చి, తమ పత్రికలో మాత్రం సేఫ్ గేమ్ ఆడరా అనే చర్చ జరుగుతుంది. మరి ఇంతకీ ఆ రోజు ప్రత్యేక హోదా అడుగుతారా ? మెడలు వంచక పోయినా, కనీసం ప్లీజ్ సార్ ప్లీజ్ అని టోన్ లో అడిగినా చాలు. చూద్దాం..

Advertisements

Advertisements

Latest Articles

Most Read