మూడు రాజధానుల పై ఇప్పటికే జీఎన్ రావు కమితే ఇచ్చింది. ఇదే విషయాన్ని కమిటీ రిపోర్ట్ ఇవ్వక ముందే, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో, మూడు రాజధానుల పై ప్రకటన వస్తుందని అందరూ అనుకున్నారు. అధికారికంగా ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, ఈ విషయం పై నిర్ణయం వాయిదా పడింది. ఇంకా బోస్టన్ కమిటీ రిపోర్ట్ రావాలి అని, అది వచ్చిన తరువాత, ఈ రెండు కమిటీల పై హైపవర్ కమిటీ వేస్తారని, అప్పుడు అసెంబ్లీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కమిటీ రిపోర్ట్ లు రావాలి అని ఒక పక్కన చెప్తున్నా, మరో పక్క మాత్రం, విశాఖ రాజధానిగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతుంది. కుర్నోల్ లో హైకోర్ట్ పెడుతున్నాం అని చెప్పినా, అది అయ్యే పని కాదు. అందుకు, ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అయితే విశాఖలో సెక్రటేరియట్ పెట్టేసి, వెంటనే అక్కడ నుంచి పనులు ప్రరంభించాలని జగన్ కుతూహలంగా ఉన్నారు.

praveen 02012020 2

అందుకు ఇప్పుడు తన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ను రంగంలోకి దింపారు. ప్రవీణ్‌ప్రకాశ్‌ విశాఖపట్నంలో పర్యటించటం ఆసక్తిగా మారింది. విశాఖపట్నం జిల్లాలో అందుబాటులో ఉన్న, ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు, ప్రవీణ్ ప్రకాష్ ని రంగంలోకి డించారు. జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌తో కలిసి పెందుర్తి, సబ్బవరం మండలాల్లో ఎంతవరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది అనే విషయం పై ఆరా తీసారు. పేదల ఇళ్ళు కోసం, పెందుర్తి మండలం గుర్రంపాలెంలో రెవెన్యూ అధికారులు సేకరించిన భూములను అలాగే, పరిశ్రమల కోసం, ఇండస్ర్టియల్‌ పార్కుకు కేటాయించిన 200 ఎకరాలను, మరి కొన్ని కంపెనీలకు ఇచ్చిన భూములను, అధికారులు ప్రవీణ్ ప్రకాష్ కు చూపించారు.

praveen 02012020 3

ఇక సబ్బవరం మండలం అసకపల్లిలో బ్లాక్‌-4 కింద సేకరించిన సర్వే నంబరు 1లోని 18.65 ఎకరాల ప్రభుత్వ భూమిని, 87లో ఉన్న 17.4 ఎకరాల డీఫారం భూములను, మ్యాపులను పరిశీలించారు. అలాగే ల్యాండ్‌ పూలింగ్‌ కింద సేకరించిన భూమి వివరాలు కూడా ఇచ్చారు. అయితే దీని పై అధికారులు మాట్లాడుతూ, పేదలకు ఇళ్ళ స్థాలాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుందని, ఆ స్థలాల పరిశీలన కోసమే, ప్రవీణ్ ప్రకాష్ వచ్చారని, చెప్తున్నారు. అయితే ఈ పనులు కోసం, సంబధిత శాఖా అధికారులు చూస్తారు కాని, ఇలా సీఎంవో ముఖ్య కార్యదర్శి, వచ్చి క్షేత్ర స్థాయిలో స్థలాలు పరిశీలించటం పై ఆసక్తిగా మారింది. ఈ పర్యటన అంతా, విశాఖ రాజధానిగా మార్చే క్రమంలో, భూములు పరిశీలన కోసమే అని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read