ప్రవీణ్ ప్రకాష్.. ఈయన సియం ఆఫీస్ లో మోస్ట్ పవర్ఫుల్ అనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రులకు కూడా లేని పవర్స్ ఈయనకి ఉంటాయని ప్రచారంలో ఉంది. జీవోల జారీలో కూడా ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలే కాకుండా, రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది అనే ప్రచారం ఉంది. అందుకే ఆయన సియం పేషీలో ముఖ్యకార్యదర్శి పదవి ఇచ్చారు. సియం పేషీలో ఆయనే మోస్ట్ పవర్ఫుల్. ఇంకా చెప్పాలి అంటే, జగన్ తరువాత ఆయనే అనే స్థాయిలో ప్రచారం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గురించి ఎందుకు అనుకుంటున్నారా ? ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రవీణ్ ప్రకాష్ కి ఇంకా సర్వీస్ ఉన్నా కూడా , ఆయన త్వరలోనే రిటైర్డ్ అయిపోతున్నారు అంట. రిటైర్మెంట్ తీసుకుని, ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వార్తలు రావటంతో అందరూ విస్మయం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ వార్త సెక్రటేరియట్ లో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ పీక్ లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్, చాలా పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. ఆయనను చీఫ్ సెక్రటరీని చేసినా ఆశ్చర్యం లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో, ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు సర్వీస్ కి రిటైర్మెంట్ ఇచ్చిన రాజకీయాల్లోకి రావటం పై చర్చ జరుగుతుంది.
ఆయన ఏపి రాజకీయాల్లోకి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం లేదు. ఆయన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు అంట. అంతే కాదు, బీజేపీ పార్టీ నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు అంట. ఇందు కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసినట్టు చెప్తున్నారు. ఆయనకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. నిజానికి బీజేపీ రిఫరెన్స్ తోనే, ఆయనకు జగన్ వద్ద అంత మంచి స్థానం వచ్చిందని చెప్తారు. ఈ నేపధ్యంలోనే, 2022లో జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం, ఆయన సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్, గ్రౌండ్ మొత్తం సెట్ చేసుకున్నారని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారాణాశి నుంచి ఆయన రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు అంట. 1994 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ ప్రకాష్, తన సహచరులు కొంత మంది ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారని, కేంద్రమంత్రి వర్గంలో ఉన్న అశ్విని కూడా ప్రావీణ్ బ్యాచ్ మేట్ అని అంటున్నారు. అయితే ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి చెప్పగా, ఆయనకు కూడా ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని ప్రచారం జరుగుతుంది.