భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఢిల్లీ వెళ్లిన తరువాత కూడా, ఆంధ్రప్రదేశ్ పర్యటన గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో అద్భుతమైన రాజాధాని ప్రజలు కోరుకుంటున్నారు అని, అమరావతి పూర్తి అయిన తరువాత, దేశంలోనే నెంబర్ వన్ సిటీగా ఉంటుంది అని ట్వీట్ చేశారు. అంతే కాదు, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ గురించి ప్రపంచానికి తన ట్వీట్ ద్వరా ప్రపంచానికి చెప్పారు. ఆసియాలోనే అతి పెద్ద వీడియో వాల్ ఇక్కడ ఉంది అని, ఇక్కడ నుంచి పరిపాలన అద్భుతంగా జరుగుతుంది అని ట్వీట్ చేసారు.

president tweet 27122017 2

మన ఫైబర్ నెట్ గురించి కూడా ట్వీట్ చేస్తూ, 149 రూపాయిలకే ఇంటర్నెట్, టీవీ, ఫోన్ ఇస్తున్న విషయం ప్రస్తావించారు. కంపెనీలు కోసం ప్లగ్ అండ్ ప్లే విధానం ప్రవేశపెట్టింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనియాడారు. డ్రోన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ టైం మానిటరింగ్ ఎలా చేస్తుందో చెప్పారు.. రాష్ట్రపతి ట్వీట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. స్వయంగా భారత రాష్ట్రపతి ట్వీట్ చెయ్యటంతో, ప్రపంచమంతా మన గురించి తెలుసుకుంటారు అని సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు, అమరావతి సచివాలయంలోని మొదటి భవనంలోని రాష్ట్ర స్థాయి రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు కమాండ్ కంట్రోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వినూతన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించడం పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనులు తెలిపారు.

president tweet 27122017 3

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ విధానంపై రాష్ట్రపతికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ మాట్లాడుతూ రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించడం పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సాధించిన ఫలితాలు కేవలం ఎపికే పరిమితం కాకుండా దేశమంతటికీ ఇవి ఉపయోగపడే రీతిలో జాతీయ స్థాయిలో ఆర్టీజిపై ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్రపతి ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోది నేతృత్వంలో మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వాటికి ఈకార్యక్రమాలు ఒక ప్రేరణగా నిలుస్తాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read