ఎవరినైనా జగన్ వాడుకుని వదిలేస్తాడు.. డీజీపీ గౌతం సవాంగ్ బదిలీతో అందరి మదిలో ఉన్న అంశం ఇప్పుడు ఇదే. ప్రతిపక్షం ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళటంతో, ఇప్పుడు దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. డీజీపీగా బదిలీ వేటు పడిన గౌతం సవాంగ్ కు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నిన్నటి నుంచి ప్రభుత్వం ఈ అంశం పై లీకులు ఇస్తూ వచ్చింది. అయితే ఈ లీకులు నేపధ్యంలో, గౌతం సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మెన్ గా నియామకం అవ్వాలి అంటే, ఆయన ప్రస్తుతం ఉన్న ఐపిఎస్ కి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ చైర్మెన్ అనేది రాజ్యాంగబద్ద పదవి కావటంతో, దాంట్లో ఉండే వ్యక్తికి ఆరేళ్ళ సర్వీస్ అయినా ఉండాలి, లేదా 62 ఏళ్ళ వయసు వచ్చే వరకు, ఏది ముందు అయితే, అప్పటి వరకు ఆ పదవిలో ఉండవచ్చు. అయితే గౌతం సవాంగ్ కు, ఆ లెక్కన చూసుకుంటే, ఇప్పటికీ గౌతం సవాంగ్ కు 17 నెలల సర్వీస్ ఉంది. తరువాత వచ్చే రెండేళ్ళ పదవి కోసం, ఇప్పటి నుంచే, రిటైర్మెంట్ తీసుకుని వేరే చోటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచనలో సవాంగ్ ఉన్నారు. పైగా అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోతుంది. జగన్ మళ్ళీ వచ్చే సూచనలు కనిపించటం లేదు. అందుకే గౌతం సవాంగ్ ఆలోచనలో పడ్డారు.
ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తన పైకి రుద్దుతున్నా, గౌతం మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వం, గౌతం సవాంగ్ పై ఒత్తిడి తీసుకుని వస్తుంది. కొంత మంది అధికారుల ద్వారా రాయబారం పంపి, ఆయన పైన ఒత్తిడి తీసుకుని వస్తుంది. ఎలాగైనా ఈ పదవి తీసుకోవాలని, లేకపోతే తమ పరువు పోతుందని ప్రభుత్వం భావిస్తుంది. గత మూడేళ్ళుగా ఆయనకు అడ్డమైన పనులు చెప్పి, ఎక్కడో తేడా రావటంతో, ఇలా అగౌరవంగా పంపించారు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వెళ్ళింది. మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపిఎస్ లలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ అభిప్రాయం బలంగా నాటుకుపొతే తమకు ఇబ్బంది అని భావించి, ఎలాగైనా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని, ఇందు కోసం ఏపీపీఎస్సీ పదవి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే గౌతం సవాంగ్ మాత్రం, ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవటం లేదు. అయితే ఇప్పటికీ డీజీపీ సవాంగ్ డీజీపీగా రిలీవ్ అవ్వలేదు. ఈ విషయం పై ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే, ఆయన డీజీపీ పదవి నుంచి దిగే అవకాసం ఉంది.