ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ తో తాడో పేడో తేల్చుకుంటానికి మరో దారి వెతుక్కునట్టు కనిపిస్తుంది. ఇదే పంతంతో ఇప్పటికే కోర్టుల్లో, మొట్టికాయలు తిన్నా, ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు వచ్చినట్టు లేదు. రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన ఆదేశాలు ఇచ్చిన లెక్క చేయటం లేదు. దీంతో చివరకు కోర్టు ధిక్కరణ పిటీషన్ కూడా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ దాఖలు చేసారు. అయితే వైసీపీ, ఎన్నికల కమీషనర్ దూకుడుకు షాక్ అవుతుంది. ఏ నిమిషాన ఏమి వస్తుందో,అనే టెన్షన్ అయితే ఉంది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావటంతో, ఎస్ఈసి దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వంలో మంత్రులు ,నిమ్మగడ్డను పర్సనల్ గా టార్గెట్ చేసారు. పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా, నిమ్మగడ్డ మా దొడ్లో కట్టేసే ఎద్దులతో సమానం అని, విజయాయి రెడ్డి నిమ్మగడ్డకు మెంటల్ అని, ఇలా కించపరుస్తూ మాట్లాడారు. దీంతో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సా, విజయసాయి, సజ్జల పై, నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. మీరు ఆక్షన్ తీసుకోవాలని, ఆక్షన్ తీసుకోక పొతే, తాను కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే నిమ్మగడ్డ మా హక్కులకు భంగం కలిగించారు అంటూ, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సా, స్పీకర్ కు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. తమ హక్కులకు నిమ్మగడ్డ భంగం కలిగించారని తెలిపారు. అయితే స్పీకర్ తమ్మినేని ఈ నోటీస్ ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే దీని పై రియాక్ట్ అయ్యారు. చర్యల కోసం ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సిఫార్సు చేసారు. అయితే ఇంత వేగంగా స్పందించటం వెనుక ప్రభుత్వం, వేరే ప్లాన్ లో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2008లో మహరాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను, ఇలాగే సభా హక్కుల నోటీస్ ఇచ్చి, రెండు రోజులు జైల్లో పెట్టిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఇలాగే, మా హాక్కులకు భంగం కలిగింది అంటూ, ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటం, ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వమని నోటీసులు ఇచ్చారు. అయితే హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అని ఎన్నికల కమిషనర్ సమాధానమిచ్చాడు. దీంతో 2008లో ఎన్నికల కమిషనర్ ని రెండు రోజులు జైలుకు పంపాలని ప్రివిలేజ్ కమిటీ లో తీర్మానించారు. అలా ఏమైనా నిమ్మగడ్డ పై చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా, ఆయన రిటైర్డ్ అయిన తరువాత అయినా, ఏదైనా చర్యలు తీసుకుంటారా అనే చర్చ నడుస్తుంది.