ఢిల్లీలో వైసీపీ - బీజేపీ నేతలు చర్చలు చేస్తూ దొరికిపోవటం, ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్‌ని కలిసి కీలక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇవాళ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ని కలిసి బుగ్గనపై ఫిర్యాదు చేశారు. బుగ్గన పీఏసీ ఛైర్మన్‌గా సభా హక్కులను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హనుమంతరాయ చౌదరి స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. భాజపా నేత రాం మాధవ్‌కు దిల్లీలో కొన్ని కీలక పత్రాలను బుగ్గన అందజేశారని వారు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హనుమంతరాయ చౌదరి స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. భాజపా నేత రాం మాధవ్‌కు దిల్లీలో కొన్ని కీలక పత్రాలను బుగ్గన అందజేశారని వారు ఆరోపించారు.
బీజేపీ ఎమ్మల్యే ఆకుల సత్యన్నారాయణ, వైసీపీ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి భేటీ పై వార్తలు రావటంతో, ముందు అవి ఖండించారు.. తరువాత సిసి టీవీ ఫూటేజ్ రావటంతో, కలిసి టిఫిన్ చేసాం అని చెప్పారు, కాని రాం మాధవ్ ను కలవలేదు అని చెప్పారు. రాం మాధవ్ ఇంటికి వెళ్లినట్టు లాగ్ బుక్ లో ఉండటంతో, రాం మాధవ్ ఇంటికి వెళ్ళలేదు అని, రాం మాధవ్ ఇంటి దగ్గర ఒక కార్ దిగి, ఇంకో కార్ ఎక్కామని చెప్పారు. మొత్తానికి, ఇరు పార్టీలు కలిసి, రాం మాధవ్ ఇంట్లో భేటీ అయినట్టు, అక్కడ పీఏసీ చైర్మన్ హోదాలో, బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, అసెంబ్లీలోని కొన్ని కీలక పత్రాలు, రాం మాధవ్ కు ఇచ్చినట్టు వార్తలు వచ్చయి. అయితే, ఇప్పుడు ఇవి బుగ్గన మెడకు చుట్టుకుంది.
ఇదే విషయం పై శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి యనమల కూడా స్పందించారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి కేంద్రానికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లి వెళ్లి భాజపా పెద్దలతో బుగ్గన భేటీ కావడం వైకాపా, బీజేపీ కుట్రలకు పరాకాష్ట అని మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ ఏదైనా విషయాలుంటే స్పీకర్‌కు తెలియజేయాలని అనంతరం శాసనసభలో దాని గురించి చర్చించా లన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక పాత్రలు, బీజేపీ పెద్దలకు చేరవేయడాన్ని గర్హించారు. లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.