ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం పై ప్రజలు ఎలా ఆందోళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... రాజకీయంగా, మోడీ చేస్తున్న అన్యాయం దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో, చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, దేశంలో అన్ని విపక్షాలు, ఈ విషయంలో చంద్రబాబుకి మద్దతు పలుకుతున్నారు... అదే సందర్భంలో, బీజేపీ, ఇక్కడ కొంత మందిని అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు... ఇలాంటి సందర్భంలో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రం, నాకు ఇవన్నీ పట్టవు అన్నట్టు, ఇంత కీలక సమయంలో, రాజ్యసభకు వెళ్ళటం లేదు..
ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 2 వరకు సెలవులు కావాలని చిరంజీవి రాజ్యసభకు కబురు పంపించారు... అయితే, చిరంజీవికి ఎమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో అనుకున్నారు అందరూ... కాని చిరంజీవి తన సొంత సినిమాలు తీసుకుంటానాకి అని తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోయారు.. చిరంజీవికి ఎంత బాధ్యత ఉందో అందరికీ తెలుసు కాబట్టి, చిరంజీవిని లైట్ తీసుకున్నారు... అయితే, ప్రజలు ఇంత ఆందోళన బాటలో ఉంటే, నిన్న చిరంజీవి చేసిన పని, ప్రజల ఆగ్రహాన్ని మరింత రెట్టింపు అయ్యేలా చేసింది...
రాజ్యసభలో రాష్ట్ర సమస్యల గురించి పోరాడకుండా సెలవులో ఉన్న చిరంజీవి, నిన్న వైజాగ్ లో, తన కొడుకు రాంచరణ్, ‘రంగస్థలం’ ప్రీరిలీజ్ వేడుకకు హాజరయ్యారు... ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు, ఆందోళన చేసారు... ‘రంగస్థలం’ ప్రీరిలీజ్ వేడుక వేదిక వద్ద ధర్నా చేశారు... రాజ్యసభకు వెళ్ళే టైం లేదు కాని, ఇలాంటి సినిమా ఫంక్షన్ లకి వచ్చే టైం ఉందా అంటూ, నినాదాలు చేసారు... ఇప్పటికైనా, విభజన హామీల అమలు కోసం రాజ్యసభలో ఆందోళన చెయ్యాలని నినాదాలు చేసారు... కనీసం వైజాగ్ లో జరుగుతున్న ఇంత పెద్ద ఫంక్షన్ లో అయినా, ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపాలని కోరారు... అయితే చిరంజీవి ఇవేమీ పట్టించుకోలేదు... అందరి మీద విరుచుకుపడే పవన్ కళ్యాణ్, చిరంజీవి విషయంలో మాత్రం, నోటికి ప్లాస్టర్ వేసుకుని, అందరికీ నీతులు చెప్తారు...