గతంలో ఏసిబి డీజీగా పని చేసి, కొద్ది రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ డీజీగా నియమించబడ్డ పీఎస్‍ఆర్ ఆంజనేయులు, ఈ రోజు హైకోర్టు ముందుకు హాజరు అయ్యారు. గతంలో ఒక కేసు విచారణకు సంబంధించి, ఈ విచారణకు హాజరు అయ్యారు. ప్రకాశం జిల్లాలో ఒక విద్యా సంస్థ పై గతంలో రైడ్లు చేసి, ఆ రైడ్లలోని వ్యక్తులకు సంబంధించి, ఎలాంటి చార్జ్ షీట్ దాఖలు చేయటం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో చార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదని, ఇన్ని రోజులు పాటు ఎందుకు పెండింగ్ లో ఉంచుకున్నారు అని చెప్పి, హైకోర్టు వ్యాఖ్యానించింది. అవినీతి కేసుల్లో ఈ విధంగా జాప్యం చేయటం, సమంజసమా అని ప్రశ్నించింది. దీని పైన వివరణ ఇచ్చేందుకు, అప్పట్లో ఏసిబి డీజీగా ఉన్న పీఎస్‍ఆర్ ఆంజనేయులను నేరుగా హైకోర్టుకు హాజరు అయ్యి, సమాధానం చెప్పాలని చెప్పి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే ఈ రోజు పీఎస్‍ఆర్ ఆంజనేయులు హైకోర్ట్ కు హాజరు అయ్యారు. హైకోర్టుకు తన వివరణ ఇచ్చారు. ఈ కేసులో తాము చార్జ్ షీట్ దాఖలు చేసామని కోర్టుకు చెప్పారు. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి, చార్జ్ షీట్ దాఖలులో జాప్యం జరిగినందుకు, పీఎస్‍ఆర్ ఆంజనేయులు హైకోర్టుని క్షమాపణ కోరారు. ఈ విధంగా కేసు ఆలస్యం అయినందుకు, కోర్టుకు క్షమాపణ చెప్పారు.
దీంతో, హైకోర్టు పీఎస్‍ఆర్ ఆంజనేయులను, వచ్చే వాయిదా నుంచి, కోర్టుకు రావాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. గతంలో కూడా ఈ కేసు హైకోర్టులో జరిగినప్పిటికీ, కింద కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే కింద కోర్టులో ఉన్నా కూడా, నేటి వరకూ కూడా కేసు విచారణ జరగుతున్నా కూడా, ఎలాంటి చార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయలేదు అంటూ, సదరు విద్యా సంస్థల చైర్మెన్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు ఈ కేసు పైన పది రోజుల క్రితం విచారణ నిర్వహించి, ఈ విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో ఇన్నేళ్ళు అయినా కూడా నేటి వరకు కూడా ఎందుకు చార్జ్ షీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. అదే విధంగా అవినీతి కేసులు దర్యాప్తు చేసేప్పుడు, నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే, వెంటనే చార్జ్ షీట్ వేయాలి కదా అని ప్రశ్నించింది. ఇది కేవలం దర్యాప్తుని సాగదేయాలనే ఉద్దేశమే అని కోర్టు వ్యాఖ్యానించింది.