జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైఎస్ వివేక కేసులో, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన దేవిరెడ్డి శంకర్ రెడ్డిని, సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో, 40 కోట్లు డబ్బు ఇస్తాను అని చెప్పింది దేవిరెడ్డి శంకర్ రెడ్డి అని, ఎర్ర గంగి రెడ్డి ఈ విషయం తనకు చెప్పాడు అంటూ, దస్తగిరి సిబిఐకి చెప్పాడు. అంతకు ముందే దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సిబిఐ విచారించి ఉండటం, దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ నేపధ్యంలో, దేవిరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ కు ముందు కూడా పెద్ద హై డ్రామా చోటు చేసుకుంది. దేవిరెడ్డి శంకర్ రెడ్డి అంతకు ఒక రోజు ముందే హైదరాబాద్ వెళ్లి, హాస్పిటల్ లో చేరారు. అయితే సిబిఐ మాత్రం, హాస్పిటల్ లో ఉన్నా వదిలి పెట్టలేదు. ఆయన్ను అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశ పెట్టింది. దేవిరెడ్డి జగన్ కుటుంబానికి సన్నిహితుడు, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు కావటంతో, ఈ అరెస్ట్ సంచలనం కలిగించింది. ఇది ఇలా ఉంటే, అరెస్ట్ తరువాత కోర్టులో ప్రవేశ పెట్టటంతో, కోర్టు అతనికి రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ లో ఉన్న వ్యక్తిని కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికీ తరలించ కూడదు. అయితే కోర్టు అనుమతి లేకుండా కడప పోలీసులు, దేవిరెడ్డి శంకర్ రెడ్డిని, రిమ్స్ కు తరలించారు.
ఈ విసహయం తెలుసుకున్న పులివెందుల కోర్టు, పోలీసులు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముందుకు వచ్చి సమాధానం చెప్పుకునే పరిస్థితి పోలీసులకు వచ్చింది. వివేక కేసు విషయంలో దేవిరెడ్డిని నవంబర్ 17వ తేదీన సిబిఐ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసారు. తరువాత నవంబర్ 18న పులివెందుల కోర్టులో ప్రవేశ పెట్టగా, కోర్టు 14 రోజులు రిమాండ్ వేసింది. అయితే విచారణ కోసం, సిబిఐ కస్టడీ పిటీషన్ వేయగా, నవంబర్ 26న కోర్టు , సిబిఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే అతను అసలు నోరు విప్పటం లేదని, సహకరించటం లేదని, నాలుగు రోజులు ఇంకా సమయం ఉండగానే సిబిఐ అధికారులు కోర్టులో హాజరు పరచగా, కోర్టు మళ్ళీ రిమాండ్ వేసి, కడప సెంట్రల్ జైలుకు పంపించింది. అయితే కోర్టు రిమాండ్ లో ఉన్న వ్యక్తిని, కోర్టుకు చెప్పకుండా, ఆర్థో సమస్య ఉంది అంటూ, దేవిరెడ్డిని మూడు రోజులు క్రితం, కడపలోని రిమ్స్ కు తరలించారు. అయితే విషయం కోర్టుకు తెలియటంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నోటీసులు ఇవ్వగా, జైలు అధికారులు సంజాయిషీ ఇచ్చారు. ఆతనికి కొన్ని సమస్యలు ఉండటంతో హాస్పిటల్ కు తరలించామని, కోర్టుకు చెప్పటం ఆలస్యం అయ్యిందని చెప్పారు.