వైఎస్ వి-వే-క కేసులో పలు దఫాలుగా విచారణ చేస్తున్న సిబిఐ అధికారులు, మరోసారి పులివెందులకు వచ్చారు. పులివెందుల కోర్టులో తమకు ఉన్నటు వంటి అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి, గతంలో పులివెందుల కోర్టులో ఉన్న డాక్యుమెంట్ లు, ఆధారాలు కోసం వచ్చారు. గతంలో సిట్ విచారణ సందర్భంగా, వాళ్ళు సమర్పించిన దర్యాప్తు నివేదిక, ఆధారాలు ఇవ్వాలని పులివెందుల కోర్టుని సంప్రదించారు. అయితే దానికి సంబంధించి, పులివెందుల కోర్టు ఆ ఆధారాలు, డాక్యుమెంట్ లు ఇవ్వటానికి నిరాకరించింది. దీంతో సిబిఐ అధికారులు షాక్ అయ్యారు. దీంతో సిబిఐ అధికారులు, తమకు కీలకమైన సమాచారం పులివెందుల కోర్టు ఇవ్వకపోవటంతో, తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు. అయితే సిబిఐ అధికారులకు, పులివెందుల కోర్టు వివరాలు ఇవ్వకపోవటం సంచలనంగా మారింది. సాంకేతిక కారణాలు చెప్పి కోర్టు వివరాలు ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే గతంలోనే సిబిఐ అధికారులకు ఇదే అనుభవం ఎదురైతే, సిబిఐ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన హైకోర్టు, పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలు, డాక్యుమెంట్ లు అన్నీ సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఉన్నా, ఇప్పుడు సిబిఐకి మళ్ళీ పులివెందుల కోర్టులో చుక్కుఎదురు అయ్యింది. మరి దీని పై ఇప్పుడు సిబిఐ ఏమి చేస్తుందో చూడాలి.
వివేక కేసులో సిబిఐకి షాక్ ఇచ్చిన పులివెందుల కోర్టు...
Advertisements