పరిటాల రవిని దారుణంగా హ-త్య చేసిన తరువాత నిందితులు, అనుమానితులు గొలుకట్టు మరణాలు తెలుగు రాష్ట్రాలకు ఇంకా నెత్తుటి సాక్ష్యాలుగా ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య తరువాత సేమ్ అలాగే అనుమానితుల అనుమానాస్పద మరణాలు, హ-త్య-లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ నలుగురు అనుమానాస్పదంగా చనిపోగా, ఏ2 సునీల్ కుమార్ యాదవ్ బంధువు భరత్ యాదవ్. వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణకి కూడా హాజరయ్యాడు. వివేకా హత్యకి 40 కోట్ల డీల్ జరిగిందని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పుడు భరత్ యాదవ్ ఒకరిని చంపేసి, మరొకరిని చావుబతుకుల్లోకి నెట్టిందీ ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు చెబుతున్నారు అంటే.. అనుమానాలు వస్తున్నాయి. పులివెందులలో భరత్ యాదవ్ జరిపిన తుపాకీ కాల్పుల్లో దిలీప్ చనిపోగా, మస్తాన్ భాష గాయపడ్డాడు. అనేక నేరాలతో సంబంధాలున్న భరత్ యాదవ్ కి లైసెన్స్ తుపాకీతో ఈ కాల్పులు జరిపాడు. పట్టపగలు ముఖ్యమంత్రి సొంతూరులో, అవినాష్ రెడ్డి మనిషిగా ప్రచారం జరుగుతున్న భరత్ యాదవ్ ఈ ఘాతుకానికి పాల్పడితే పోలీసుల స్పందన మరో తీరుగా ఉంది. చంపడం కరెక్టే కానీ, దీనిపై పోలీసుల చెప్పే వెర్షన్ కాకుండా ఇంకేమైనా రాస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు పోలీసు అధికారి. గతంలోనూ భరత్ యాదవ్ తుపాకీతో కాల్పులు జరిపి హత్యాయత్నం చేసినా, తుపాకీ స్వాధీనం చేసుకోకపోవడంపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
పులివెందులలో కాల్పులు ఘటన వెనుక వివేకా కేసులో, సిబిఐ ప్రశ్నించిన వ్యక్తి
Advertisements