ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం రాజకీయంగా బలమైన కుటుంబం. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కూడా అందరూ ఒకే తాటి పైన ఉన్నారు. చివరకు జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా, కుటుంబం మొత్తం బాసటగా నిలిచింది. జగన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఆయనకు రాజకీయంగా కూడా 2019 వరకు అండగా ఉన్నారు. 2019 గెలుపు తరువాత, కుటుంబంలో విబేధాలు వచ్చాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అందుకు తగ్గట్టుగానే, షర్మిల కొత్త పార్టీ పెట్టటం, సాక్షి టీవీని బహిరంగంగా తిట్టటం, అలాగే సజ్జల పైన చేసిన కామెంట్స్, ఇవన్నీ చూస్తే, కుటుంబంలో విబేధాలు నిజమే అని తేలింది. అంతే కాదు, షర్మిల ఏకంగా ఏబిఎన్ ఆర్కే తో ఇంటర్వ్యూ లో కూర్చోవటంతో , విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం అవుతుంది. అలాగే షర్మిల ఆస్తి తగాదాల గురించి కూడా ప్రస్తావించారు. అయితే గత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా, కుటుంబంలో రాజీ కుదిరిందనే ప్రచారం జరిగింది. దీంతో అప్పట్లో, షర్మిల, జగన్, విజయమ్మ కలిసి వచ్చి, సమాధి దగ్గర నివాళులు అర్పించారు. అంతా బాగానే ఉందని వైఎస్ అభిమానులు సంతోషిస్తున్న సమయంలో, మళ్ళీ క్రిస్మస్ సందర్భంగా, పులివెందులలోనే విబేధాలు బయట పడ్డాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

punlvendula 25122021 2

ప్రతి క్రిస్మస్ కు, వైఎస్ కుటుంబం మొత్తం పులివెందులలో కలిసి, పండుగ చేసుకుంటారు. ఈ సారి కూడా అలాగే, మొత్తం పులివెందుల వెళ్లారు. అయితే షర్మిల గురువారం వచ్చి, గురువారం రాత్రే తిరిగి వెళ్ళిపోయరనే వార్తలు వచ్చాయి. వైఎస్ సమాధి వద్దకు ఎవరికి వారు విడి విడిగా వెళ్లి నివాళులు అర్పించారు. తరువాత షర్మిల వెళ్ళిపోవటంతో అందరూ షాక్ అయ్యారు. గురువారం రాత్రి ఏదో జరిగి ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ రోజు క్రిస్మస్ పండుగ రోజున, వేడుకల్లో షర్మిల కనిపించలేదు. ఈ రోజు మాత్రం విజయమ్మ, జగన్ పక్కనే ఉండి, కేకు కూడా తినిపించారు. అయితే షర్మిల విషయంలో మాత్రం, విబేధాలు కొనసాగుతున్నట్టు అర్ధం అవుతుంది. వైఎస్ వర్ధంతి సందర్భంగా చేసిన రాజీ ఫలించలేదని తెలుస్తుంది. ఇంత పెద్ద రాజకీయ కుటుంబంలో, విబేధాలు రావటంతో, వైఎస్ అభిమానులు కూడా బాధ పడుతున్నారు. మరో పక్క టిడిపి మాత్రం, సొంత వాళ్ళకే జగన్ న్యాయం చేయకుండా, చెల్లిని, తల్లిని ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు చేస్తుంది. కుటుంబ వ్యవహారం కాదని, ముగ్గురూ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టే మాట్లాడుతున్నాం అని, జగన్ మనస్తత్వం గురించి చెప్తున్నామని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read