వైఎస్ కుటుంబానికి పులివెందుల అడ్డా. రాజశేఖర్ రెడ్డి వ్యవహారాలతోపాటు పులివెందుల నియోజకవర్గం మొత్తం వైఎస్ వివేకానందరెడ్డి కనుసన్నల్లో ఉండేది. వైఎస్ పావురాలగుట్టలో హెలికాప్టర్ కూలి దుర్మరణం పాలవడంతో పులివెందుల ఈక్వేషన్ష్ మారిపోయాయి. బాబాయ్ వివేకానందరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో వైఎస్ జగన్ రెడ్డి తరఫున పులివెందుల వ్యవహారాలు చూసేందుకు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వీరి చిన్నాన్న మనోహర్ రెడ్డి దిగారు. అనంతరకాలంలో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి కూడా వైసీపీలో చేరారు. కానీ పులివెందులలో పట్టుజారిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మరికొందరితో కలిసి వివేకానందరెడ్డిని దారుణంగా చంపించేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఏ పులివెందులలో పట్టు కోసం బాబాయ్‌ని అబ్బాయిలు వేసేశారో.అదే పులివెందుల నుంచి వారు కూడా జైలుబాట పట్టేలా ఉన్నారు. తండ్రి ఆల్రెడీ జైలుకి చేరగా, నేడో రేపో తనయుడు అవినాష్ రెడ్డి కూడా అరెస్టు అవుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి తన తరఫున పులివెందుల బాధ్యతలు చూడటానికి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డిని దింపుతున్నారని సమాచారం. అవినాష్ రెడ్డిని కాపాడటానికి చేసిన విశ్వప్రయత్నాలు విఫలం కావడంతో ..బాబాయ్ మర్డర్ కేసు తనవరకూ రాకుండా చూడాలంటే అవినాష్ రెడ్డితో ఆగిపోయేలా చేసుకోగలిగాడని టాక్ వినిపిస్తోంది. బాబాయ్‌ని చంపేశారు. అబ్బాయిలు జైలుకెళ్లారు. ఇప్పుడు పులివెందుల బాధ్యతలు చూడటానికి తమ మనిషే కావాలి అనే కోణంలో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనవడైన అభిషేక్ రెడ్డి, ఆయన భార్య డాక్టర్లు కావడంతో ప్రజలకి దగ్గర కాగలరని సీఎం జగన్ రెడ్డి భావిస్తూ..వీరిని రంగంలోకి దింపారని తెలుస్తోంది.
బాబాయ్ అవుట్..అబ్బాయ్ క్లీన్ బౌల్డ్..పులివెందులకి కొత్త కాపరి
Advertisements