పులివెందుల అనేది నిన్నమొన్నటివరకూ వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోట! అక్కడ వారు చెప్పిందే వేదం. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు! రాజకీయాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎదుగుతూ వచ్చే క్రమంలో పులివెందులపైనా తన పట్టు పెంచుకున్నారు. నాటినుంచి నేటివరకూ సుమారు నాలుగు దశాబ్దాలపాటు పులివెందులలో ఇదే పరిస్థితి! వార్డుమెంబరు సహా అన్ని పదవులు వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే ఉంటాయి. దాదాపు చాలా పదవులను ఆ కుటుంబ సభ్యులే అనుభవిస్తుంటారు. ఇతర పార్టీల నేతలు ఆ ప్రాంతంలో తిరిగే సాహసం కూడా చేయరు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తిరిగారు. ఈ తరుణంలో ఆయన పులివెందులకు వెళితే ఆ ప్రాంతవాసులు చిరంజీవిపై దాడులకు సిద్ధపడ్డారు. నల్లజెండాల ప్రదర్శనతో వ్యతిరేకించారు.

pulivendula 0802019

పులివెందుల గతంలో కరువుతో అల్లాడింది. దాహంతో అలమటించింది. సాగునీరు లేక రైతాంగం తల్లడిల్లింది. అలాంటి ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఇప్పుడు సస్యశ్యామలం చేశారని ఆ ప్రాంత వాసులు సంబరపడుతున్నారు. ఈ అంశం వారి మదిలో బలంగా నాటుకుపోయిందట! శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను గండికోట ప్రాజెక్టుకు రప్పించి.. అక్కడినుంచి ఆ నీటిని కాలువల ద్వారా పులివెందులకు పారించారు. అలాగే పులివెందుల ప్రాంతంలో ఉన్న పైడిపాలెం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో పులివెందుల ప్రాంత రైతుల పంట పండింది. కనీవినీ ఎరుగని రీతిలో వారు పంటలు సాగుచేశారు. ఇప్పుడు పులివెందుల ప్రాంతం ఆకుపచ్చని కళతో అలరారుతోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై పులివెందుల వాసులకు ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడింది.

pulivendula 0802019

రెండేళ్ళ క్రితం పులివెందుల రైతులు సీఎం చంద్రబాబును ఆశ్రయించారు. కాపుకి అందుకున్న తమ పండ్లతోటలు నీరులేక ఎండిపోతున్నాయని మొరపెట్టుకున్నారు. వారి బాధలు విన్న చంద్రబాబు వెంటనే స్పందించారు. ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ట్యాంకర్లతో నీటిని తోలించారు. ఎండిపోతాయనుకున్న పంటలను కాపాడారు. ఈ అనుభవంతో పులివెందుల రైతులు ఎంతో ఆనందపడ్డారు. తాము ఎప్పటికీ చంద్రబాబు చేసిన మేలును మరచిపోమని డైరక్టుగానే చెబుతున్నారట. నాడు చంద్రబాబుపై దాడికి పాల్పడిన వారే నేడు తమ ప్రాంతం సస్యశ్యామలం కావడాన్ని చూసి తెగ మెచ్చుకుంటున్నారట. పులివెందులలో జగన్ కుటుంబ సభ్యులు సైతం చంద్రబాబు అమలుచేసిన రైతు ఋణమాఫీ పథకం లబ్ధిదారులుగా ఉన్నారట. చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎన్నడూ జగన్ బంధువులు ప్రభుత్వ ఫలాలను అందుకోలేదు. ఈసారి మత్రం వారి వైఖరిలో మార్పు సుస్పష్టం! ఒక్క మాటలో చెప్పాలంటే పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చిన సంగతి వాస్తవం. గత రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ప్రాంతంలో తెలుగుదేశానికి మెల్లమెల్లగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పులివెందులలో ఓట్లశాతం బాగా పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా పులివెందులలో పరిస్థితి బాగా మారిపోయింది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భారీగా ఓట్లు పడతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read