పులివెందుల పులి బిడ్డ అంటూ, చెప్పుకునే జగన్ పై, ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ సర్వే చేసారు. అన్ని నియోజకవర్గాల్లో చేసినట్టే, జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పై కూడా సర్వే చేసారు. అయితే ఈ రిపోర్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదే షాకింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళి జగన్ కు ఇచ్చాడు ప్రశాంత్ కిశోరే. అయితే, ఈ సర్వే పై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు, మళ్ళీ సర్వే చెయ్యమన్నట్టు వార్తలు వచ్చాయి. నేనే సియం అని ఆంధ్రా అంతా అనుకుంటుంటే, ఇదేమి సర్వే అంటూ జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. జగన్ ఎంత చెప్పినా వినడు కాబట్టి, మరో సారి సర్వేకి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్.. ఇదేదో సామెత ఉన్నట్టు, అక్కడ ఉన్నది వస్తుంది కాని, లేనిది ఎక్కడ నుంచి వస్తుంది.. ఇంతకీ ఆ సర్వే ఏంటో చూద్దాం...
నాలుగు దశాబ్దాలుగా, పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట... ఈ విషయం అందరికీ తెలిసిందే. పులివెందుల మెజారిటీ పైనే, కడప ఎంపీ సీటు కూడా ఆధారపడి ఉంటుంది అంటే, అంత మెజారిటీ వస్తు ఉండేది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్ తన మార్క్‌ని ప్రదర్శించేవారనీ, అవసరమైతే సామ- దాన- భేద- దండోపాయాలను ప్రయోగించేవారనీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే జగన్ హాయంలో అంతా రివర్స్ లో ఉంది వ్యవహారం.. చివరకి సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేని దీని స్థితికి పడిపోయాడు జగన్.. ఎప్పుడూ లేనిది వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఓటమి అంటే ఏంటో తెలిసి వచ్చింది. దీనికి ప్రధాన కారణం జగన్ వైఖరి. ఈ మైనస్ ఉండగానే, చంద్రబాబు అభివృద్ధి అనే మంత్రంతో, పాజిటివ్ ఫీల్ తో పులివెందుల ప్రజలకు చేరువ అయ్యారు.
నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ పాలనలో ఉన్న పులివెందులకు సరైన తాగు- సాగునీటి సదుపాయం లేదు. ఇదే ఇక్కడి ప్రధాన సమస్య కూడా. వైఎస్ కుటుంబం పరిష్కరించలేని ఈ సమస్యని చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి.. అక్కడనుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు. తద్వారా పులివెందుల కెనాల్స్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకు తాగు- సాగునీటికి కొదవ లేకుండా పోయింది. వ్యవసాయపరంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే అక్కడ ప్రజలను ఆకట్టుకునేలా చేస్తుంది. ఎప్పుడూ లేనిది, పులివెందులలో తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహిస్తే.. భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. మరో పక్క సంక్షేమం కూడా పీక్స్ లో ఉంది. ఇవన్నీ ఇప్పుడు పులివెందుల ప్రజలు ఆలోచించేలా చేస్తున్నాయి.
జగన వైఖరి, చంద్రబాబు అభివృద్ధితో, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ కంచు కోటకు బీటలు ఇప్పటికే వచ్చాయి. వైఎస్ వివేక ఓటమితోనే అది రుజువైంది. అయితే, ఈ పరిణామాల్లో సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్ కు, షాకింగ్ రిజల్ట్ కనిపించింది. ఈ సారి జగన్ మెజారిటీ 10 వేలు కూడా దాటదు అని సర్వే రిజల్ట్ వచ్చింది. దీని ప్రభావం, కడప ఎంపీ సీటు పై పడి, అది ఓడిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ఇంకా సంవత్సర కాలం ఉండగానే, ఇలా ఉంటే, ఎన్నికల సమయానికి ఇంకా పోజిటివ్ ఓటు పెరుగుతుంది అని, పులివెందుల సీటుకే ఎసరు రావచ్చని, మరో సీట్ పై కూడా కన్నేసి ఉంచాలని, ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ తయారు చేసి, జగన్ కు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే, జగన్ మాత్రం తన సహజ స్వభావాన్ని చూపించి, పులివెందుల ఈ సారి లక్ష మెజారిటీ వస్తుంది, ఈ సర్వే తప్పు, మరో సారి సర్వే చెయ్యమని, ప్రశాంత్ కిషోర్ కు చెప్పినట్టు తెలుస్తుంది.