పులివెందుల చరిత్రలోనే ఎప్పుడూ చూడని సంఘటనలు ఇవి... ఈ మాటలు అంటున్నది ఆ ఊరి పెద్దలు... రాష్ట్రాన్ని రామారావు పార్టీ పెట్టి ఒక ఊపు ఊపాడు, అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డికే జై కొట్టాం... నిన్న చంద్రబాబు వచ్చినప్పుడు మా ఊరిలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్పందన ఇక్కడ ఇది వరకు ఎప్పుడూ చూడాలా... జగన్ హయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించుకోవాలా... జగన్, ఇక్కడ జరుగుతుంది అర్ధం చేసుకోలేకపొతే నష్టపోతాడు... ఇవే మాటలు నిన్న పులివెందులలో ఎక్కువుగా వినిపించాయి... ఇదంతా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పై వచ్చిన పోజిటివ్ మూడ్... ఇన్నాళ్ళు విసుగెత్తిపోయిన అక్కడి ప్రజలకు, బాగా నచ్చిన అభివృద్ధి మంత్రం..
నిన్న పులివెందులలో జరిగిన చంద్రబాబు సభకు, ప్రజలు పెద్ద ఎత్తున తరిలి వచ్చారు... 25-30 వేల మంది వస్తారు అని అంచనా వేస్తే, 50 వేలు దాటింది... చంద్రబాబునాయుడు సభ 2 గంటలకు ప్రారంభం కానుండగా జనం 11 గంటల నుంచే మైదానంలోకి తరలివచ్చారు. పులివెందుల ప్రాంతీయులు, పరిసర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. ఉదయం 11 నుంచి వేదిక వద్ద వేచి ఉన్న జనం, ముఖ్యమంత్రి సభ 4.45 గంటలకు ముగిసేవరకు ఓపిగా అక్కడే ఉండడం విశేషం.... పులివెందుల పట్టణంలో కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీలు చేపట్టి, ఉత్సా హంగా చిందులు వేస్తూ ఆనందంతో మునిగి తేలారు.
పట్టణంలో చంద్రబాబు సభ భారీగా విజయవంతం కావడం కార్యకర్తలు, నేతల్లో ఆనందం కనిపిస్తోంది. నియోకవర్గ ఇంచార్జ్, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి సీఎం సభ విజయవంతం కోసం కొద్ది రోజులుగా పులివెందుల్లోనే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారిక కార్యక్రమం కావడంతో జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంపై దృష్టిపెట్టారు. సభకు వచ్చిన వారిలో మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. గతేడాది జనవరి 11న పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాళెంకు వచ్చిన చంద్రబాబు అప్పుడు గండికోట ఎత్తిపోతల నుంచి పైడిపాళెంకు నీటిని విడుదల చేశారు. ఏడాదికి తిరిగి పులివెందులకు వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు గండికోట నుంచి చిత్రావతి రిజ ర్వాయర్కు ఎత్తిపోతల పథకం నుంచి వస్తున్న నీటిని పరిశీలించి జలహారతి ఇచ్చారు. కృష్ణా జలాలు జిల్లాకు రావడం పులివెందుల ప్రాంతానికి రావడంతో ఇక్కడి వాసుల్లో ఆనందం వ్యక్త మవుతోంది.