వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్‌ నేత సతీశ్‌రెడ్డిని పులివెందుల అసెంబ్లీ స్థానంలో జగన్‌పై పోటీకి నిలుపనుంది. కొద్దిరోజుల క్రితం కడప జిల్లా ముఖ్యులతో సమావేశమైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వాన్ని తెలియజేశారు. గత ఎన్నికల్లో కూడా ఆయనపై సతీశే పోటీచేశారు. జగన్‌ తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కూడా సతీశ్‌ పోటీ చేయడం విశేషం. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట వంటి పులివెందులలో గత 20 ఏళ్లుగా ఆయనే టీడీపీ అభ్యర్థిగా తలపడుతున్నారు.

pulivendula 008012019

వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే ఓట‌మి పాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప‌లో ముఖ్యంగా పులివెందుల‌లో అభివృద్ధి కార్యక్రమాలు, కృష్ణా జలాలు, వైసీపీ నుంచి చేరికల ఆసరాగా సంఖ్య పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే టీడీపీకి దక్కింది. మిగిలిన అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం చూపిస్తున్నా టీడీపీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం.. విభేదాలతో తరచూ వీధికెక్కడం ఆ పార్టీకి సమస్యగా మారింది. అయినా ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ వైసీపీకి గట్టి సవాల్‌ విసిరింది. అయితే, ఈ టెంపోను వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించి.. జ‌గ‌న్‌నే ఓడించాల‌ని బాబు వ్యూహం ప‌న్నారు.

pulivendula 008012019

అయితే, గెలుపు గుర్రంగా భావిస్తున్న సతీశ్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇక‌, ఇక్క‌డ బ‌రిలో ఎవ‌రున్నా.. టీడీపీ నాయ‌కులు మూకుమ్మ‌డిగా ఇక్క‌డ వాలిపోయి.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ చేయ‌నున్నారు. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్లు.. సీఎం.ర‌మేష్‌, బీటెక్ ర‌విలు అటు పొలిటిక‌ల్‌గాను ఇటు ఆర్థికంగాను కూడా జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కొన్ని మండ‌లాల‌ను వారు పంచుకుని మ‌రీ టీడీపీని బ‌లోపేతం చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ జెండా ఎగిరేలా నేత‌లు పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ అక్కడ ఓడించడం సాధ్యం అవుతుందా ? అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గుతారా ? లేక వైఎస్ సెంటిమెంట్ వైపే ఉంటారా అనేది చూడాలి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read