ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పైన, నాయముర్తుల పైన సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ, అలాగే వైసీపీ సానుభూతి పరుడు అయిన పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయటానికి సిబిఐ రంగం సిద్ధం చేసింది, ఇటీవల హైకోర్టు , సిబిఐ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, పంచ్ ప్రభాకర్ ని అరెస్ట్ చేయకుండా ఏమి చేస్తున్నారు, అతని పైన ఏమి చర్యలు తీసుకున్నారు, సామాజిక మాధ్యమాల్లో అతను పెట్టినటు వంటి పోస్టులు కూడా తొలగించేందుకు ఏ చర్యలు ఎందుకు తీసుకోలేదు ? అసలు సిబిఐ ఏమి చేస్తుంది అంటూ, సిబిఐ పై హైకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపధ్యంలో, పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు సిబిఐ రంగం సిద్ధం చేసింది. ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసులను జారీ చేసింది. అన్ని డిప్లమాటిక్ చానెల్స్ ద్వారా పంచ్ ప్రభాకర్ తో పాటుగా, ఏపి న్యాయమూర్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఎన్ఆర్ఐ ని కూడా అరెస్ట్ చేసేందుకు, ఇంటర్ పోల్ ద్వారా, డిప్లమాటిక్ ఛానెల్స్ ద్వారా ఈ బ్లూ నోటీస్ లు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసిన తరువాత, అధికారికంగా పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయటానికి, తగినటు వంటి చర్యలు తీసుకునేందుకు, మార్గం సుగుమం అయ్యింది అనే చెప్పవచ్చు.

cbi 11112021 2

ఈ చర్యతో పంచ్ ప్రభాకర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకుని వచ్చి, కోర్టు ముందు ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించి సిబిఐ కొద్ది సేపటి క్రితమే అధికారిక ప్రకటన కూడా చేసింది. పంచ్ ప్రభాకర్ తో పాటుగా మరొక ఎన్ఆర్ఐ అరెస్ట్ కూడా సిద్ధం అయినట్టు తెలుస్తుంది. ఇక మరో ఆరుగురు వ్యక్తులు పైన చార్జ్ షీట్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళు కూడా గతంలో న్యాయమూర్తుల పైన, న్యాయస్థానాల పైన కామెంట్స్ చేసిన వారిలో ఉన్నారు. గతంలోనే ఏడుగురు పై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు మరో ఆరుగురి పైన చేయటంతో, మొత్తం 11 మంది పైన చార్జ్ షీట్ దాఖలు చేసినట్టు అయ్యింది. తాజాగా చార్జ్ షీట్ దాఖలు చేసిన వారిలో, ఏ.శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, జి.శ్రీధర్ రెడ్డి, సుశ్వరం శ్రీనాథ్, దరిష కిశోర్ రెడ్డి, సుద్దులూరి అజయ్ అమృత్‍ ఉన్నారు. మొత్తం 90 మంది పైన సిబిఐ అభియోగాలు మోపింది. ఇందులో ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. మరి వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read