చంద్రబాబుని దింపాలి... చంద్రబాబు మళ్ళీ గెలవ కూడదు.. చంద్రబాబుని ఓడించాలి.. ఇవి ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ పెద్దల కలవరింతలు... తమకు ఎదురు తిరిగిన చంద్రబాబు పై, కక్ష తీర్చుకుంటం కోసం, ఒక పెద్ద ఆపరేషనే చేస్తున్నారు.. ఇందుకోసం ఏ అవకాసం వదులుకోవటం లేదు.. మోత్కుపల్లి లాంటి చిన్న నేతను కూడా, వాడుకుంటున్నారు అంటే, వీళ్ళ ఆత్రం అర్ధమవుతుంది.. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు తెర వెనుక ఉన్న వ్యవహారలు, ఇప్పుడు ఓపెన్ అవ్వనున్నాయి.. ప్రతి సారి దొంగ చాటుగా కలిసి, దొరుకిపోతున్నాం అని ఏమో, ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వారందరితో నడిచేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే జగన్ పార్టీ, అన్ ఆఫిషయల్ గా,బీజేపీతో కలిసి పని చేస్తుంది. అనేక సార్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కలిసి, డైరెక్ట్ గా రంగంలోకి దిగనున్నారు.
అన్ ఆఫిషయల్ గా, కాకుండా ఆఫిషయల్ గా పవన్ తో కలిసి పని చెయ్యటానికి, రెడీ అవుతుంది బీజేపీ.. పవన్ టార్గెట్ కూడా చంద్రబాబే కాబట్టి, అందరూ కలిసి పని చేయ్యనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్‌ను కలిసి చర్చలు జరిపే బాధ్యతను దగ్గుబాటి పురందరేశ్వరికి బీజేపీ అధిష్టానం అప్పగించింది. వారం రోజుల్లో వైజాగ్‌లో పవన్‌ను కలిసి చర్చలు జరపనున్నారని సమాచారం. చంద్రబాబుకు వ్యతి రేకంగా జనసేనను కూడా తమవైపు తిప్పుకునే వ్యూహంలో బీజేపీ ఉంది. ఉత్తరాంధ్ర యాత్రలో ఉన్న పవన్‌ను ఆ ప్రాంతంలోనే కలిసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో పురందరేశ్వరి విశాఖపట్నంలో పవన్‌ను కలుస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
బీజేపీతో ఎన్నికల్లో కలిసే అంశంపై ఆయన అభి ప్రాయాల మేరకు పార్టీ అధిష్టానం స్పందించనుంది. పురంద రేశ్వరి చర్చల అనంతరం పవన్ కళ్యాణ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కలుస్తారని సమాచారం. పవన్ కళ్యాణ్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే ప్రకాశ్ జవదేకర్ ఆయనతో చర్చలు జరిపిన తర్వాత పరిస్థితు లను బట్టి అమిత్ షా కూడా పవన్‌తో మాట్లాడుతారని తెలుస్తోంది. 019లో ఆంధ్రాలో చంద్రబాబును దెబ్బతీసే వ్యూహం తో ఉన్న భాజపా ఇప్పటికే వైకాపాతో సఖ్యత నెరపుతూ పవన్ కళ్యాణ్‌ను కూడా తమ జట్టులో చేర్చుకునే ప్రయత్నాలు ఆరంభించింది. జగన్, పవన్ ఇద్దరూ, అమిత్ షా గుప్పిట్లో ఉన్నారు కాబట్టి, ఇక వీరు కలిసి పని చెయ్యటం లాంచానమే. విడి విడిగా పోటీ చేస్తే, ఓట్లు చీలి, చంద్రబాబు లాభపడతారు కాబట్టి, అందరూ కలిసి పోటీ చేసి, చంద్రబాబుని దించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. మరి, ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఎన్నికలు, వీరి కలియికని ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారో చూడాలి అంటే, ఎన్నికల వరకు ఆగాల్సిందే...